టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ అవకాశాల కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. తెలుగులో చాలా తక్కువ మందికి హీరోయిన్ గా అవకాశాలు వస్తుంటాయి. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా అవకాశాన్ని పొందాలంటే వాళ్ళు తెలుగు వారు అయి ఉండకూడదు. కాని హీరోయిన్ గా నిరూపించుకోవడం కోసం తెలుగు అమ్మాయిలు సైతం వారి వంతుగా తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ విషయంలో యాంకర్స్ కొద్దిగా ఒక అడుగు ముందుకేశారు. ఇప్పటికే పలువురు యాంకర్స్ హీరోయిన్స్ గా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నటిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్ లోకి రావటానికి యాంకర్ అనసూయ సిద్ధంగా ఉంది. అందుకు ఈ బ్యూటీ అన్ని రకాలుగా సిద్ధం అంటుంది. ఇక్కడ అనసూయ బుల్లితెర మీద మోస్ట్ గ్లామరస్ యాంకర్ గా కొనసాగుతున్నప్పటికీ.. సినిమాల్లో అవకాశాల కోసం ఆరాటపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ తడాఖా, కిరాక్ వంటి షోలతోపాటు తాజాగా వస్తున్న మోడ్రన్ మహాలక్ష్మీ అనే టీవీ షోకు యాంకరింగ్ గా చేస్తున్నప్పటికీ.. సినిమా ఆఫర్లు రావడం లేదనే బెంగతో వుందని తెగ ఫీల్ అవుతుందట. గతంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘‘అత్తారింటికి దారేది’’ సినిమాలో ఓ ఐటంసాంగ్ ఆఫర్ అవకాశం వస్తే.. అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత వున్న పాత్ర అయితేనే చేస్తానంటూ దాన్ని రిజెక్ట్ చేసేసింది. అలాగే మరో రెండు, మూడు మూవీల ఆఫర్లను కూడా తిరస్కరించింది. దీంతో ఇప్పుడు ఈ బ్యూటీకి ఆఫర్స్ రావడం చాలా కష్టంగా ఉంది. ఇప్పడు అనసూయకి హీరోయిన్ గా నటించాలనే కోరిక ఎక్కువుగా ఉందట. అందుకే తను హీరోయిన్ కోసం ఎటువంటి అవకాశాన్ని వచ్చినా వదులు కోవడం లేదు. ఇతర హీరోయిన్స్ లాగే ఈ అమ్మడు కూడా అప్పుడప్పుడు అందంగా పోజులిస్తూ ఫోటోషూట్స్ ఇస్తోంది. ఈ బ్యూటీ ఇస్తున్న ఫోటోషూట్స్ కి ఎవరైన నిర్మాత కాని, దర్శకుడు కాని కరుణిస్తే అనసూయ కచ్ఛితంగా హీరోయిన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.దీంతో ఈ అమ్మడు సినిమాల్లో ఆఫర్లు కొట్టేయడం కోసమే ఇలా ఫోటోషూట్ లు ఇస్తోందంటూ సన్నిహిత వర్గాలతోపాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: