సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ బ్యూటీ సమంతకి కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చేదు అనుభవం ఎదురయింది. ముఖ్యంగా సమంత కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోలతో జోడి కడుతుంది. ఆ విధంగానే తను నటించిన తాజా కోలీవుడ్ చిత్రం సికిందర్, బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడంతో సమంత పరిస్థితి తారు మారైంది. సమంత ఇప్పుడు విజయ్ సరసన నటించేందుకు సిద్ధంగా ఉంది. ఈ మూవీలో సమంత పాత్రని కేవలం గ్లామర్ కోసమే కాకుండా, కథని తగ్గట్టుగా వాడుకోవాలని దర్శకుడు భావింస్తున్నాడట. మొదట విజయ్ సరసన గ్లామరస్ పాత్ర చేస్తే చాలు అని చెప్పిన దర్శకుడు, తరువాత సమంత పాత్రని రి-డిజైన్ చేసి, సమంత కొద్దిగా కష్టపడేలా సీన్స్ ని డైరెక్టర్ క్రియేట్ చేశాడు. కేవలం గ్లామర్ కోసమే సమంతని ఉపయోగించుకుంటే మూవీ సక్సెస్ కావడం అనేది చాలా కష్టం. అందుకే సమంతని కథలో భాగంగా ఉపయోగించుకోవాలని కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భావిస్తుంది. అలాగే సమంత అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వటానికి సైతం కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆసక్తిగా లేదంట. ఎక్కువ రెమ్యునరేషన్ లేకుండా, అలా అని తక్కువ రెమ్యునరేషన్ కాకుండా ఓ రేంజ్ వరకూ అయితే, సమంతకి మనీ ఇవ్వడానికి ఇబ్బందిలేదని నిర్మాతలు అంటున్నారు. సమంత అడిగే గొంతెమ్మ కోర్కెలని తీర్చలేమని కోలీవుడ్ నిర్మాతలు కచ్ఛితంగా చెబుతున్నారు. అలా అయితేనే మూవీకి పని చేయమని కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మాతలు సమంతకి చాలా స్ట్రిక్ట్ గా చెబుతున్నారు. సూర్య సరసన నటించిన సికిందర్ మూవీ నష్టాల పాలవ్వడంతో సమంతకి కోలీవుడ్ లో డిమాండ్ తగ్గిందనేది తాజా సమాచారం. ఇక తను నటించబోతున్న అప్ కమింగ్ కోలీవుడ్ ఫిల్మ్స్ ఎటువంటి రిజల్ట్స్ ని సాధిస్తాయో అని సమంతకి కంగారు పుడుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: