టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కరెక్ట్ కటౌట్ హీరోయిన్ అనుష్క అని అంటారు చాలా మంది. ఎందుకంటే అనుష్క ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రి ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకూ తన బాడీ ఫిజిక్ ని ఏ మాత్రం తగ్గకుండా, అదే విధంగా మెయింటెన్ చేసుకుంటూ వస్తుంది. ఇదిలా ఉంటే అనుష్క తాజాగా తన పెళ్ళి వ్యవహారంకి సంబంధించిన విషయంపై కోలీవుడ్ లో కామెంట్ చేసినట్టుగా కథనాలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో అనుష్క త్వరలోనే పెళ్ళి చేసుకోబోతుందన్నట్టు మీడియాలో తెగ ప్రచారం జరగుతుంది. అందుకు అనుష్క నుండి ఎటువంటి రియాక్షన్ రాకపోవడంతో, ఆ వార్తలు నిజమే అని కొన్ని పత్రికలు సైతం, వాటిని కన్ ఫర్మ్ చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క ఇచ్చిన స్టేట్ మెంట్ కి చాలా మందికి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే తను ఇప్పట్లో పెళ్లి చేసుకునేది లేదంటూ ఖరాఖండిగా చెప్పింది. అలా చెప్పడమే కాకుండా తనకి "ఓ మగాడిని చూపించండి, పెళ్లి చేసుకుంటాను. నాకు టైం వేస్ట్ కాదు కదా" అని తన పళ్లి గురించి మాట్లాడే వారికి ఛాలెంజ్ విసిరింది. అలా సరదాగా చెబుతూనే, "తనకు సరైన మ్యాచ్ ని తెస్తే, వారికి నేను ప్రేమతో ఓ ముద్దుని కూడ ఇస్తాను" అంటూ చెప్పుకొచ్చిందట. దీంతో కోలీవుడ్ లో అనుష్క పెళ్లి మేటర్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. ఇదిలా ఉంటే అనుష్క ప్రస్తుతానికి ఫిల్మ్ షూటింగ్ లతో తెగ బిజిగా ఉంటుంది. ఓ వైపు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రుద్రమదేవి, అలాగే రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న బాహుబలి మూవీ, అలాగే మరోవైపు రజనీకాంత్ సరసన హీరోయిన్ గా చేస్తున్న లింగా మూవీకి సంబంధించిన షూటింగ్స్ తో, క్షణం తీరిక లేని సమయాన్ని అనుష్క గడుపుతుంది. ఇంత బిజిగా ఉంటూ, తన పని తాను చేసుకుంటూ పోతుంటే, "ఎవరో అనుష్కకి పెళ్ళి అని పుకార్లు క్రియోట్ చేస్తున్నారు. వారి మాటలను నమ్మదు. నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్ధేశం లేదంటూ" అనుష్క చాలా క్లారిటిగా చెప్పుకొచ్చిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: