తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించిన మొదటి సంవత్సరంలో నిన్న తన పుట్టినరోజును ఆనందంగా జరుపుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రాంత ప్రముఖ హాస్య నటుడు నిన్న ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి 150వ సినిమాకు సంబంధించి ఒక విచిత్రమైన సంచలన ప్రకటన చేసాడు. చిరంజీవి కుటుంబంతో తనకు ఉన్న సన్నిహిత సంబంధo రీత్యా చిరంజీవి నటించబోయే 150వ సినిమాకు దర్శకత్వం ఎవరు వహించినా అసిస్టెంట్ డైరెక్టర్ గా మాత్రం తానే ఉంటాననీ ఒక విచిత్ర కోరిక బయట పెట్టాడు వేణుమాధవ్. ఈ కోరికను ఎప్పుడో రామ్ చరణ్ వద్ద ప్రస్తావించాననీ ఈ కోరికకు చరణ్ అంగీకారం కూడా ఉంది అని అంటున్నాడు వేణుమాధవ్. ఈ విషయంలో రామ్ చరణ్ తనకు ఇచ్చిన మాట తప్పడని తన అభిప్రాయం అని అంటున్నాడు వేణుమాధవ్.గత 18 సంవత్సరాలుగా దాదాపు 600 సినిమాలలో నటించిన వేణుమాధవ్ ప్రస్తుతం తన సినిమాలను తగ్గించు కోవడానికి గల కారణం ప్రస్తుతం తెలుగు సినిమాలలో పెరిగి పోతున్న బూతు పదాలు అని అంటున్నాడు.  అంతేకాదు ఎవరైనా యంగ్ రైటర్ మంచి కధతో ముందుకు వస్తే తాను సినిమాని నిర్మిస్తానని చిరంజీవిలాగా మాట ఇస్తున్నాడు. అయితే బహిరంగంగా ప్రకటించిన వేణుమాధవ్ కోరికకు రామ్ చరణ్ ఎటువంటి స్పందన తెలియచేస్తాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: