దేవుడుకు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి - హుండీలో డబ్బులు ఎందుకు వేయాలి – హారతి ఎందుకు ఇవ్వాలి ఇటువంటి అనేక ఆధ్యాత్మిక సందేహాలకు పవన్ తన 'గోపాల గోపాల' లో మోడ్రన్‌ శ్రీకృష్ణుడిగా సమాధానాలు ఇస్తాడని ఈ సినిమా దర్శకుడు డాలీ అంటున్నాడు.  ప్రస్తుతం ఈ ఆధ్యాత్మిక విషయాలను వివరించే ఒక ప్రత్యేక గీతాన్ని హైదరాబాద్ శివారు ప్రాంతాలలో పవన్ తన ప్రత్యేకమైన మోటారు బైక్ ను నడుపుతూ పాడుతున్న ఈ ఇంట్రడక్షన్ సాంగ్ ను పవన్ పై చిత్రీకరిస్తూ భాగ్యనగరంలో కలియుగ శ్రీకృష్ణుడి హడవిడిని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ ఒక ప్రత్యేకమైన బైక్ ను ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ బైక్ ఫోటోలు బయటకు వచ్చాయి. దానిపై ఓమ్ 786 అని ఉంది. హ్యూసంగ్ జీవి 650 అఖీలా ఈ బైక్ పేరు, భారీ ఆకారంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ బైక్ గురించి ఈ సినిమా రిలీజ్ అయ్యాక అందరూ మాట్లాడుకునే విధంగా ఈ బైక్ ను డిజైన్ చేసారు. ఈ బైక్ ఖరీదు 6,60,000 అనే వార్తలు ఇప్పటికే బయటకు వచ్చాయి. ఆవేశంతో ఉన్న పాటలకు, హీరోయిన్స్ తో రొమాన్స్ చేసే పాటలకు స్టెప్పులు వేసిన పవన్ వేదాంత సారాన్ని తెలియచేసే ఒక ప్రత్యెక పాటలో ఈ సినిమాలో కనిపిస్తూ ఉండటం ‘గోపాలా గోపాలా’ లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రత్యేకత.  

మరింత సమాచారం తెలుసుకోండి: