‘మిర్చి’ సినిమాతో టాలీవుడ్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన నదియా క్రేజ్ ‘అత్తారింటికి దారేది’ సినిమాతో టాప్ రేంజ్ కు ఎదిగిపోయింది. అయితే వచ్చిన అవకాశాలన్నీ ఒప్పుకోకుండా చాల జాగ్రత్తగా సినిమాలను ఎంచుకుంటూ తన క్రేజ్ నే కాకుండా తన పారితోషిక లెవెల్ ను కూడా కాపాడుకుంటూ వస్తోంది నదియా. వినిపిస్తున్న వార్తల ప్రకారం నదియా కొరటాల శివ దర్సకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమాలో మహేష్ అక్కగా నటించడానికి అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ న్యూస్ ను స్వయంగా నదియా వెల్లడించింది అని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ‘ఆగడు’ పరాజయం తరువాత మహేష్ నటిస్తున్న కొరటాల శివ సినిమా మహేష్ కెరియర్ కు సంబంధించి చాల ప్రాముఖ్యతగా మారింది. దీనితో కొరటాల శివ పై కూడా ఈ సినిమా విపరీతమైన ఒత్తిడిని తెస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. వినిపిస్తున్న వార్తలను బట్టి నదియా ఈ సినిమాలో అక్క పాత్రలో కనిపిస్తూ ఉండటంతో మహేష్ కొరటాల శివల లేటెస్ట్ మూవీ సిస్టర్ సెంటిమెంట్ తో ఉండబోతోందా అనే ఊహలకు తావు ఇస్తోంది. ‘ఆగడు’ లో ఎన్ని పంచ్ లు వేసినా అదృష్టం కలిసి రాని మహేష్ తిరిగి చాలామంది టాప్ హీరోలకు కలిసివచ్చిన ఒకనాటి సిస్టర్ సెంటిమెంట్ ను మళ్ళీ వెలుగులోకి తీసుకు వస్తున్నాడా అని అనిపిస్తోంది. అక్టోబర్ రెండవ వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: