నిన్నటిదాకా బాలీవుడ్ టాప్ హీరో షారుఖ్ ఖాన్ తో ఇలియానా ఒక భారీ సినిమాలో నటించబోతోంది అనే వార్తలను చూసి ఇలీబేబి దశ తిరిగింది అని అనుకున్నారు అంతా. అయితే ఈ గోవా సుందరి త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పేసి తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్ళి చేసుకొని, సంసార జీవితంలో సెటిల్ అయిపోతుంది అంటూ బాలీవుడ్ మీడియా ఇలియానా పై వార్తలు వ్రాయడం మొదలు పెట్టింది.  ఈ సన్న నడుం సుందరి ఆస్ట్రేలియాకు చెందిన ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో గత కొంత కాలంగా పీకలలోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రేమ మరీ ముదిరి పోవడంతో మరి కొద్ది నెలలలోనే ఈ ప్రేమను పెళ్ళిగా మార్చి ఇక ఇలియానా సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తోంది అనే వార్తలు ఊపు అందుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. ఈ నవంబర్ 1కి 28 ఏళ్ళ వయసు దాటుతున్న ఈ బ్యూటీ తన ప్రేమ వ్యవహారాన్ని గుట్టుగా దాచకపోయినా, నిశ్చితార్థం, పెళ్ళి గురించి ఇప్పటి దాకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాల షూటింగ్ పూర్తి చేసుకొని, ఆమె పెళ్ళి చేసుకుంటుంది అని ఇంత ఖచ్చితంగా మీడియా వార్తలు వ్రాయడానికి ఒక కారణం బయటకు వచ్చింది.  బాలీవుడ్ లోని కొందరు నిర్మాతలు తమ కొత్త సినిమా ప్రతిపాదనలతో ఇలియానా దగ్గరకు వెళితే ఇకపై తాను సినిమాలు చేయబోవడం లేదని చెప్పినట్లుగా మీడియా వార్తలు వ్రాస్తోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ పై కోపంగా ఉన్న ఇలియానా బాలీవుడ్ పై కూడా కోపం పెంచుకుని సినిమాలు వదులు కోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: