టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ రామ్ చరణ్ ని మెగాపవర్ స్టార్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. అయితే ఆ పేరు తప్ప ఇప్పటి వరకూ రామ్ చరణ్ కి మరో పేరుతో పిలిచిన హీరో లేడు, దర్శకనిర్మాతలు లేరు. కాని తాజగా రామ్ చరణ్ ని మెగాపవర్ స్టార్ కాకుండా లిటిల్ బాస్ అనే పేరుతో పిలుస్తూ, ఆ నిర్మాత హాట్ టాపిక్ గా మారాడు. తనే బండ్ల గణేష్. బండ్లగణేష్, రామ్ చరణ్, కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన అప్ కమింగ్ ఫిల్మ్ గోవిందుడు అందరివాడేలే త్వరలోనే థియోటర్స్ ని హిట్ చేయబోతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ప్రివ్యూని బండ్ల గణేష్ ఈ రోజు కుటుంబ సమేతంగా చూశాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ ద్వారా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న వ్యక్తి బండ్ల గణేష్. సినిమా పూర్తయ్యాక వాళ్ళ నాన్న ఇచ్చిన కాంప్లిమెంట్ తో నా కళ్ళు చెమర్చాయని బండ్ల గణేష్ అన్నాడు. ‘ఉదయమే సకుటుంబ సమేతంగా “గోవిందుడు అందరివాడేలే”చూసాం. ఈ సినిమా తీసినందుకు జీవితాంతం గర్వపడచ్చు అని నాన్న అంటున్నప్పుడు ఆనందంతో కళ్ళు చెమర్చాయి. ఒక కళాఖండాన్ని, తెలుగు ఇళ్ళలో మావిడి తోరణం లాంటి సినిమా తీసిచ్చిన మా దర్శకుడు కృష్ణవంశీ కలకాలం పచ్చగా ఉండాలి! నాకు ఈ అవకాశం ఇచ్చిన లిటిల్ బాస్ రామ్ చరణ్ గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు. మాకు అన్నయగా అండగా అన్నింటికీ పెద్ద దిక్కుగా తోడుగా నీడగా కోదండరాముడుగా వెన్నంటి నిలబడి నడిపించిన మెగాస్టార్ చిరంజీవి గారికి కృతఙ్ఞతలు.’ అని బండ్ల గణేష్ ట్వీట్ చేసాడు. అంతే కాకుండా లిటిల్ బాస్ తో మరో మూవీని చేసేంత వరకూ తనని ప్రశాతంగా ఉండనివ్వను అంటూ కూడ కామెంట్ చేశాడు. చివరగా అన్న ఆ మామే కొద్దిగా ఇబ్బందిగా ఉందంటూ పలువురు బండ్లగణేష్ చేసిన కామెంట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: