పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ గోపాల గోపాల. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. తొలిసారిగా విక్టరి వెంకటేష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జంటగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఈ గోపాల గోపాల. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ టాప్ రేంజ్ కి చేరుకుంది. అన్ని ఏరియాల నుండి పంపిణీ దారులు అత్యధిక రేట్లకి గోపాల గోపాల మూవీ హక్కులని తీసుకోవటానికి పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి దేవుడుగా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ నగర శివార్లలో జరుగుతోంది. ఈ న్యూస్ ని తెలుసుకున్న అక్కడి అభిమానులు పవన్ కళ్యాణ్ ని చూడటానికి భారీ సంఖ్యలో తరలి వచ్చారంట. దీంతో కొన్ని సీన్స్ ని అవుట్ డోర్ ప్లాన్ చేయాల్సి ఉండగా, వాటిని జనసందోహం తగ్గిన తరువాత తీయాలని చిత్రయూనిట్ నిర్ణయించుకుంది. అలాగే పవన్ కళ్యాణ్ పై వచ్చే కీలక సీన్స్ షూట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బైక్ పై వచ్చే సీన్స్ ని కూడ షూట్ చేస్తున్నారు. దర్శకుడు పార్థసాని పవన్ కళ్యాణ్ బాడీ మాడ్యులేషన్ ని చాలా డిఫ్రెంట్ గా చూపిచటానికి ప్రయత్నిస్తున్నాడు. అలాగే పవన్ కళ్యాణ్ డైలాగ్స్, పెర్ఫార్మన్స్ సినిమాకి మేజర్ హైలైట్ అవుతుందని ఎంతో నమ్మకంగా ఉన్నారు. విక్టరీ వెంకటేష్ కి జోడీగా శ్రియ నటిస్తోంది. అయితే ఈ ‘గోపాల గోపాల’ సినిమా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘ఓ మై గాడ్’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతుంది. 2015 సంక్రాంతి బరిలో గోపాల గోపాల మూవీ సత్తా చాటబోతుందని ఇండస్ట్రీ అంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: