మరో రెండురోజుల్లో విడుదల కాబోతున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సూపర్ హిట్ అవ్వడం ఖాయం అనే మాట అందరి నోట వినిపిస్తోంది. అయితే ఇటువంటి పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలను నిర్మాత మంచి ఫ్యాన్సీ రేట్లకు అమ్ముకుని ఒడ్డున పడతాడు.  అయితే ఈ సినిమా రైట్స్ ఎవ్వరికీ ఇవ్వకుండా నైజాం, కృష్ణా ఏరియాల్లో సొంతంగా నిర్మాత బండ్ల గణేష్ రిలీజ్ చేస్తున్నట్టు వస్తున్న సమాచారం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. కలెక్షన్స్ పరంగా ఫస్ట్ ప్లేస్‌లో ఉండే నైజాం ఏరియాలో సొంతంగా నిర్మాతే ఈ సినిమాను విడుదల చేయడం పై రకరకాల గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఈమధ్య ‘రభస’, ‘ఆగడు’ ఘోర పరాజయం చెందడంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా విడుదల పై నిర్మాత బండ్ల గణేష్ కు చెప్పిన కండిషన్స్ నిర్మాతకు నచ్చక పోవడంతో బండ్ల గణేష్ ఈ సాహసం చేస్తున్నాడు అని టాక్. అదేవిధంగా నైజాం ఏరియాకు సంబంధించి బండ్ల గణేష్ ఊహించుకున్న స్థాయిలో ఈ సినిమాకు ఆఫర్లు రాకపోవడం కూడా ఒక కారణంగా చెపుతున్నారు.  ఇది ఇలా ఉండగా రెండు రోజులలో విడుదల కాబోతున్న ఈ సినిమా పబ్లిసిటీ ఇంకా భారీ స్థాయికి చేరుకోక పోవడం కొంతమందిని ఆశ్చర్య పరుస్తూ ఉంటే మరి కొంతమంది ఇది బండ్ల గణేష్ మితిమీరిన నమ్మకం అని అంటున్నారు. ఏమైనా పాజిటివ్ టాక్ ఉన్న సినిమాను నిర్మాత స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేయడం టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: