సామాన్యంగా మీడియాకు దూరంగా ఉండే చరణ్ తన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా ప్రమోషన్ విషయంలో మీడియా ముందు ఆ సినిమా గొప్ప తనాన్ని వివరిస్తూ తన కొత్త సినిమాలకు సంబంధించిన విషయాల పై స్పందించాడు అని వార్తలు వస్తున్నాయి.  తనకు ఏ కధ అయినా పూర్తిగా నచ్చితేకాని తాను సినిమాను ఒప్పుకోననీ అంటూ బోయపాటి శీను రెండు కథలు చెప్పాడు ఆ కధలు తనకు నచ్చలేదు అని అన్నాడు. అదేవిధంగా శ్రీను వైట్లతో ప్రాధమిక చర్చలు మాత్రమే జరిగాయని ఏదైనా మంచి కథ ఉంటే అప్పుడు ఆలోచించాలి అని అంటూ ఇప్పటికైతే శ్రీనువైట్ల సినిమా ఏమీలేదు అంటూ బాంబ్ పేల్చాడు. మణిరత్నం మంచి కథే చెప్పినా తనకు నచ్చక వదిలేసాననీ చరణ్ అసలు విషయం బయట పెట్టాడు.  తాను సినిమాలకు అంత సులువుగా కమిట్ కాననీ, తొందర పడి నిర్మాతల దగ్గర ఎడ్వాన్స్ లు తీసుకోననీ అంటూ బండ్ల గణేష్ బలవంతం వల్ల కొరటాల శివ సినిమాకు కొబ్బరికాయ కొట్టి కధ నచ్చక వదిలేసాననీ, కాని ఎప్పటికైనా కొరటాల శివతో సినిమాను చేస్తాను అని చెప్పుకొచ్చాడు మెగా పవర్ స్టార్. తాను నిర్మాత కావాలి అన్నది తన తల్లి కోరిక అంటూ అందుకోసమే తన తండ్రి 150వ సినిమాకు నిర్మాతగా మారుతున్నాను అనే అభిప్రాయాన్ని చెప్పాడు చరణ్. ఎనిమిదో సినిమా తెలుగు హీరోలకు గండం అన్న విషయం తన దృష్టి దాకా వచ్చినా తనకు అటువంటి సెంటిమెంట్లు లేవు అని అంటున్నాడు చరణ్. తాను పత్రికలు, వెబ్ సైట్లు చూడననీ తన వ్యక్తులు ఎవరైనా ఫలానా పత్రికా, ఫలానా వెబ్ సైట్లో వార్తలు బాగున్నాయి చూడమని చెపితేనే చూస్తాననీ మీడియా పైనే సెటైర్ వేసాడు చరణ్. ఈ వార్తలు ఇలా ఉండగా రామ్ చరణ్ వచ్చే సంవత్సరం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చరణ్ ఒక తమిళ, తెలుగు సినిమాను కలిపి చేయడానికి అంగీకరించాడు అనే వార్తలు వస్తున్నాయి. చరణ్ తన దర్శకుల ఎంపిక విషయంలో చెప్పిన విషయాలు రామ్ చరణ్ మితిమీరిన ఆత్మస్థైర్యాన్నికి ప్రతీకలు అనుకోవాలి. మరి ఈ ధైర్యానికి రేపు గోవిందుడు ఏ రిజల్ట్ యిస్తాడో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: