ప్రతిరోజు ఎదో ఒక సంచలనం చేసే వర్మ ఈసారి చాల పెద్ద సంచాలనానికే రంగం సిద్ధం చేస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. గతంలో బాబా సాహెబ్ థాకరే జీవితాన్ని ఆధారంగా తీసుకని ‘సర్కార్’ సినిమాను తీసి సంచలనం చేసిన వర్మ దృష్టి లేటెస్ట్ గా అత్యంత ప్రజాదారణతో ముందుకు సాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవితాన్ని ఆధారంగా తీసుకుని ‘భగవాన్’ అనే సినిమాను తీయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా మీడియాలో వార్తలు కనిపిస్తున్నాయి. యద్ధార్ధ సంఘటనలు సినిమాలుగా తీసి వాటిని కాసుల రూపంలో మార్చుకోవడంలో అందివేసిన చేయిగా పేరున్న వర్మ నిజంగా ఈ సాహసం చేయగలిగితే అది సంచలనమే అవుతుంది. అయితే వస్తున్న వార్తలు ఎంత వరకు నిజం అన్న విషయం పై క్లారిటీ లేదు.  ఈ సినిమాలో భగవాన్ గా నటించమని వర్మ అమితాబ్ పై ఒత్తిడి చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం పై ఇంకా అమితాబ్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అంటున్నారు. నిజంగా అమితాబ్ అంగీకరిస్తే ఈ భగవాన్ బాలీవుడ్ సినిమా రంగంలో సంచలనమే అవుతుంది. వరస పరాజయాలతో కుంగి పోతున్న వర్మకు ఈ సినిమాతో టర్నింగ్ పాయింట్ రావడం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: