ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫర్ఫెక్షన్ కి మారు పేరుగా మారిన అమీర్ ఖాన్ అంటే ఎవరికైన ఇష్టమే. అయితే ఈ హీరోతో పనిచేయటానికి చాలా మంది దర్శకులు పోటీ పడుతుంటారు. ఆ విధంగానే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ డైరెక్టర్ సైతం తన మనస్సులోనే మాటలని , అమీర్ ఖాన్ గురించిన వివరాలను బయటకు తెలియజేశాడు. ఆ కమర్షియల్, క్రేజీ డైరెక్టరే రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి మూవీ షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. దాదాపు 180 కోట్ల భారీ వ్యయంతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం గత రెండేళ్ళ నుండి కష్టపడుతున్నాడు. తనకు షూటింగ్ సమయంలో దొరికిన కొద్దిపాటి విరామ సమయంలో ముంబై మిర్రర్ అనే ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వూలో తన భవిష్యత్ కార్యచరణకి సంబంధించిన పలు విషయాలను వెల్లడించాడు. భవిష్యత్ లో అమీర్ ఖాన్ సినిమాకు దర్శకత్వం చేయాలనుందని అంటూ తన కోరికను వెల్లడించాడు. ఇదే విషయంపై ఇంకాస్త వివరంగా చెబుతూ ... "నేను హిందీ సినిమాలు ఎక్కువగా చూడను. బట్, రాజ్ కుమార్ హిరాణి & అమీర్ ఖాన్ సినిమాలు చూడడం మాత్రం మిస్ చేయను. భవిష్యత్ లోఅమీర్ ఖాన్ తో ఒక సినిమాకు కలసి పని చేయాలని నా కోరిక. అతను నా కోరికను మన్నిస్తారని ఆశిస్తున్నాను." అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘విక్రమార్కుడు’, ‘మర్యాద రామన్న’ సినిమాలను హిందీలో రీమేక్ చేశారు. అవి ఘనవిజయం సాధించాయి. ‘ఈగ’ డబ్బింగ్ వెర్షన్ ‘మక్కి’ కూడా మంచి విజయం సాధించి బాలీవుడ్ లో రాజమౌళికి పేరుని తీసుకొచ్చింది. దీంతో బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాజమౌళి పై మంచి ఒపీనియన్స్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: