బాహుబలి మూవీకి సంబంధించిన షూటింగ్ దాదాపు సగం కి పైగా పూర్తి చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ ని ఇప్పటి నుండే రాజమౌళి స్టార్ చేస్తున్నాడు. దాదాపు 180 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న మూవీ కావడంతో, ఈ మూవీని మార్కెట్ చేయడం అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఓ సాహసం లాంటిదే. బాహుబలి లాంటి మూవీ టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని, అలాగే నిర్మాతకి లాభాన్ని తెచ్చిపెడితే, తరువాతి కాలంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే టాలీవుడ్ అగ్రస్థానానికి చేరుకోవటానికి తక్కువ సమయమే పడుతుంది. ఇదిలా ఉంటే ఈ బాహుబలి మూవీకి సంబంధించిన కథ ఎలా పుట్టింది? ఎన్ని రోజులు ఈ బాహుబలి మూవీ కథ కోసం కష్టపడాల్సి వచ్చింది? వంటి విషయాలని రాజమౌళి తెలియజేశాడు. ‘రాజ్యం కోసం, అధికారం కోసం పోటీ పడుతున్న ఇద్దరు అన్నదమ్ముల పోరాట గాధ ‘బాహుబలి’ కథ. మా నాన్న విజయేంద్ర ప్రసాద్ రాసిన ఈ కథను సినిమాకు అనువుగా మార్చుకోవడానికి, తరువాత దీనిని డెవలప్ చేయడానికి నేను ఏడాది సమయం తీసుకున్నాను. సిల్వర్ స్క్రీన్ పై భారి స్థాయిలో ఈ సినిమా తెరకెక్కించాలని నా ప్రయత్నం.’ అని అన్నారు ప్రముఖ దర్శకులు రాజమౌళి. ఇప్పటికే పలు విధాలుగా రామోజీ ఫిల్మ్ సిటీ బాహుబలి షూటింగ్ కి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్స్ జరిగాయి. ఫైట్ మాస్టర్ పీటర్ హైయిన్స్ నేతృత్వంలో ప్రత్యేకంగా నిర్మించిన 100 అడుగుల భారి విగ్రహం వద్ద యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రతి రోజు 1000 మందికి పైగా జూనియర్ ఆర్టిస్టులు, 250 మంది టెక్నీషియన్లు మరియు ఇతర ప్రొడక్షన్ సభ్యులు షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: