మెగా హీరో రామ్ చరణ్ నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ గోవిందుడు అందరివాడేలే మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2000 ధియోటర్స్ లో రిలీజ్ చేయటానికి సిద్ధంగా ఉంటే, ఒక రాష్ట్రంలో మాత్రం ఈ గోవిందుడు అందరివాడేలే మూవీ రిలీజ్ కి నోచుకోవడం లేదు. టాలీవుడ్ వర్గాలలో ఈ మూవీఫై భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సమయంలో మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో గోవిందుడు అందరివాడేలే మూవీ విడుదలకి నోచుకోకపోవడంతో, సినిమా బిజినెస్ కి ఇది దెబ్బతీసే అవకాశంగా కనిపిస్తుంది. చెన్నైలో రామ్ చరణ్ మూవీకు చెన్నైలో మొదటి రోజున దాదాపు కోటి రూపాయల వరకూ కలెక్షన్స్ రావచ్చనే అంచనాలలో బిజినెస్ వర్గాలు ఉన్నాయి. మూవీ విడుదల ఆగిపోవడంతో, ఈ న్యూస్ చెన్నైలోని మెగా అభిమానులకు నిరాశ కలిగించే విషయమే. శుక్రవారం నుండి ‘గోవిందుడి..’ ప్రదర్శన ఉంటుందని సమాచారం. జయలలిత అరెస్ట్ కు నిరసనగా తమిళ చిత్ర పరిశ్రమ నిరసన తెలిపింది. ఈ రోజు నిర్మాతలు, నటులు, దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఇతర టెక్నీషియన్లు నిరాహారదీక్ష చేపట్టారు. అలాగే ధియేటర్ ఎగ్జిబిటర్ లు మరియు డిస్ట్రిబ్యూటర్లు స్వచ్చందంగా సినిమాల ప్రదర్శన నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మొత్తానికి బుదవారం అంటే అక్టోబర్ 1న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా తమిళనాడులో విడుదల కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: