ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ బజిగా ఉన్న స్టార్ డం హీరోగా కెరీర్ ని లీడ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తను నటించిన ఆగడు మూవీ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడంతో, తన కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించిన పనుల్లో బిజి అయిపోయాడు. అలాగే తరువాతి ప్రాజెక్ట్స్ కి సంబంధించిన పనులనూ చూసుకుంటున్నాడు. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు మహేష్ బాబు ఓ యాక్షన్ డైరెక్టర్ దర్శకత్వంలో నటించే అవకాశం ఎక్కువుగా కనిపిస్తుంది. భారీ సినిమాల దర్శకుడు వి.వి వినాయక్ దర్శకత్వంలో త్వరలో మహేష్ బాబు తో సినిమాను తీయనున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వచ్చే ఏడాది తను మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం వున్నట్టు వినాయక్ తెలిపాడు. హీరోయిజాన్ని తనదైన శైలిలో ఎలివేట్ చెయ్యగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న వినాయక్, మహేష్ బాబుని ఏ విధంగా తన కథతో ఇంప్రెస్ చేశాడో అందరికి ఆసక్తిని కలిగిస్తుంది. వినాయక్ లాంటి ఎక్స్ ట్రీమ్ యాక్షన్ డైరెక్టర్ తో , మహేష్ బాబు ఎటువంటి పాత్రలో నటిస్తాడు అనేది అందరి ఊహలకు అందని టాపిక్. ప్రస్తుతం ఈ కాంబినేషన్ కి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ గా మారనుంది. మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. దీని తరువాత పూరి సినిమా వుంటుంది. అక్కినేని అఖిల్ ని వినాయక్ లాంచ్ చేయనున్నాడని ఇప్పటికే టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా కొరటాల శివతో తరువాత మహేష్ బాబు ఎవరి దర్శకత్వంలో చేస్తాడు అనేది తెలియాలంటే మరో నెల రోజులు వెయిట్ చెయ్యాల్సిందే అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: