ఈగతో రాజమౌళి క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. దక్షిణాదిన మిగతా మూడుభాషల్లో అనువాదమైన ఈ సినిమా సుమారు రూ.130 కోట్లు వసూలు చేసింది.అంతేకాదు, హిందీలోనూ విడుదలయ్యింది. మరి, అంతగొప్ప సెల్యులాయిడ్ అద్భుతాన్ని థియేటర్ కు దీటుగా ఇంట్లోనే చూడగలిగితే? ప్రత్యేకించి... ఈగ సినిమాను రాజమౌళి ఎలా తీశారో కూడా చూడగలిగితే? ఈ అవకాశాన్ని ఇస్తోంది ఆదిత్య మ్యూజిక్ సంస్థ. ఒరిజినల్ సినిమాను డిజిటల్లీ రీమాస్టర్ చేసి, ఇంగ్లిష్ సబ్ టైటిళ్లతో విడుదల చేస్తున్నారు. అంతేకాదు, బ్లూరే కూడా వస్తోందండోయ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: