‘ఆగడు’ సినిమా శ్రీనువైట్ల పరువును ఎంతవరకు దిగాజార్చాలో అంతవరకు దిగజార్చి శ్రీనువైట్లకు కోలుకోలేని దెబ్బ తీసింది. దసరా సెలవులు అయిన తరువాత ‘ఆగడు’ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడు కుందాం అని ఆ మధ్య శ్రీనువైట్ల డాంబికంగా చెప్పినా దసరాకు ముందే ‘ఆగడు’ వేడి పూర్తిగా చల్లారిపోయింది. దీనితో మహేష్ అభిమానులకే కాదు, టాలీవుడ్ లో చాలామందికి టార్గెట్ గా మారాడు శ్రీనువైట్ల. ‘గోవిందుడు అందరివాడేలే’ విడుదల తరువాత మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్న కృష్ణవంశీ శ్రీనువైట్ల పేరు చెప్పకుండా చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంసంగా మారాయి. తాను గతంలో దర్శకత్వం వహించిన ‘మురారి’, ‘చందమామ’ సినిమాలు విజయవంతం అయ్యాక అదే మూసలో ఉండే సినిమాలు తీయమని చాలామంది నిర్మాతలు తనను బలవంత పెట్టినా ఆ సినిమాల ఛాయలతో ఉండే సినిమాలను తాను తీయలేదని ఒక సూపర్ హిట్ ఇచ్చిన సినిమా కధను మళ్ళీ మార్చి సినిమాగా తీస్తే జనం చూడరని కృష్ణవంశీ కామెంట్స్ చేసాడు. అయితే విశ్లేషకులు మాత్రం కృష్ణవంశీ చేసిన ఈ కామెంట్స్ శ్రీనువైట్లను ఉద్దేసించి అన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘దూకుడు’ సినిమాకు మార్పులు చేసి ‘ఆగడు’ గా రావడంతో శ్రీనువైట్లకు ఘోర పరాజయం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇన్ని విషయాలు తెలిసిన కృష్ణవంశీ ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమాను మార్పులు చేసి ‘గోవిందుడు’ గా మార్చిన్నప్పుడు ఈ అనుసరణ ఆలోచనలు కృష్ణవంశీ ఆలోచనలకు రాలేదా అన్నదే ప్రశ్న.    

మరింత సమాచారం తెలుసుకోండి: