నిన్న సాయంత్రం నుండి విశాఖపట్నంలో తుఫాన్ బాధితులను పరామర్శిస్తున్న పవన్ కళ్యాణ్ కు ఇంతటి ప్రకృతి విలయ తాండవంలో కూడా ప్రజలు, అభిమానులు పవన్ చూడటానికి ఎగబడిన సంఘటనను చూసి పవన్ కళ్యాణ్ చెలించిపోయి తాను సినిమా నటుడుని అయి పొరపాటు చేసానేమో అని అంటూ ఇంత బాధలో కూడా తన పై ప్రజలు చూపెడుతున్న అభిమానానికి చెలించిపోయి కామెంట్ చేసాడు పవన్.  ఇక ఈరోజు ఉదయం పవన్ చంద్రబాబును కలిసి ఆ తరువాత జరిగిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు పక్కనే పవన్‌కల్యాణ్ కూర్చుని చంద్రబాబుకి ఒకవైపు ఆర్థిక‌మంత్రి యనమల రామకృష్ణుడు మరోవైపు పవన్‌కల్యాణ్ కనిపించడంతో పవన్ తాను కూడా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ లో ఒక ముఖ్య భాగం అనేదట్లుగా కనిపించాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పవన్ అందించిన ఆర్ధిక సహాయానికి కృతజ్ఞతలు తెలియచేయడమే కాకుండా పవన్ సామాజిక స్ఫ్రుహను తన పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసారు. ఏమైనా పవన్ ఒకవైపు తుఫాన్ బాదితులకు ఓదార్పును ఇస్తూనే ఎన్నికల తరువాత ప్రజలకు పవన్ కనిపించకుండా పోయాడు అనే విమర్శలకు సరైన సమాధానం ఇస్తున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: