ఒక అమ్మాయి జీవితంలో ఇన్ని అధ్యాయాలు ఉండటం చాల అరుదుగా జరుగుతుంది. కాని కలర్స్ స్వాతి జీవితంలో ఈమూడు విషయాలు ఒకదాని వెంట ఒకటి రావడం ఎవరికైనా ఆశ్చర్యం కలిగిస్తుంది. రష్యాలో పుట్టిన అమ్మాయి తెలుగు బుల్లితెర పై యాంకర్ గా రాణించి ఆతరువాత సినిమా నటిగా మారి మన తెలుగులో కన్నా ఎక్కువగా తమిళ మలయాళ భాషల సినిమాలలో నటించింది స్వాతి. అటువంటి స్వాతి ఇప్పుడు తన భావుకతను జోడిస్తూ ఇంగ్లిష్ లో కవితలు రాస్తోంది. ‘‘సమ్ ఐస్ సీ యువర్ వీక్‌నెస్, అండ్ ధైర్ లిప్స్ స్ప్రెడ్ అగ్లీ లైస్. దే యూజ్ ధైర్ లార్జ్ లార్జ్ వింగ్స్, దే యూస్ దెమ్ టు ప్లై ఫాస్ట్ అండ్ హై’’. ఇలాంటి పదాలతో ఈ బ్యూటీ రాసిన ఈ కవిత తన ట్విటర్ లో పెట్టి తన చిత్ర పరిశ్రమ స్నేహితులందరికీ అంకితం ఇస్తున్నట్లుగా తన ట్విటర్ లో పోస్టు చేసింది.  అయితే స్వాతి రాసిన ఈ కవితను చూస్తూ ఉంటె తనకు సినిమా రంగంలో ఎదురైన చేదు అనుభవాలకు కవితా రూపం ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. దీపావళికి విడుదల అవుతున్న స్వాతి నటించిన ‘కార్తికేయ’ అనుకున్న విధంగా హిట్ కాకపోతే ఇలా రోజుకొక కవితను తన ట్విటర్ లో పెట్టి జనాన్ని హింస పెట్టినా ఆశ్చర్యం లేదు...  

మరింత సమాచారం తెలుసుకోండి: