మెగా బ్రదర్ నాగబాబు నట వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ మెగా హీరోల లిస్టును పెంచుతున్న వరుణ్ తేజ్ నటిస్తున్న ‘ముకుంద’ సినిమా షూటింగ్ పూర్తి అయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉండటంతో ఈ సినిమా విడుదల గురించి ఫిలిం యూనిట్ ఆలోచిస్తోంది అనే వార్తలు వినపడుతున్నాయి.  తెలుస్తున్న సమాచారం మేరకు ఈ సినిమాను డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున విడుదల చేయడానికి పక్కా ప్లాన్ రచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఆడియోను నవంబర్ లో విడుదల చేయాలని ఈ సినిమా యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన సాయి ధరమ్ తేజ్ ‘పిల్లా నీవులేని జీవితం’ సినిమాను నవంబర్ లో విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉండటంతో రాబోతున్న మూడు నెలలలో నెలకి ఒక్కటి చొప్పున సాయి ధరమ్ తేజ్ తో  మొదలయ్యే మెగా హీరోల సినిమాల హడావిడి నెలకి ఒకరు చొప్పున వస్తూ సంక్రాంతికి రాబోతున్న పవన్ ‘గోపాల గోపాల’ తో ముగిసి రాబోతున్న మూడు నెలల కాలం టాలీవుడ్ రంగానికి మెగా క్వార్టర్ గా మారబోతోంది.  ఇలా ఒకే కుటుంబానికి చెందిన హీరోల సినిమాలు క్రమం తప్పకుండా మూడు నెలల కాలంలో ప్రతి నెల సందడి చేసే విషయంలో కూడా మెగా కుటుంబం మరో రికార్డు క్రియేట్ చేస్తోంది అనుకోవాలి... 

మరింత సమాచారం తెలుసుకోండి: