తమిళ యువ హీరో విశాల్, శృతి హాసన్ జంటగా నటించిన సినిమా ‘పూజ’. హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ఈ 'పూజ' మూవీని తెరకెక్కిస్తున్నారు. యాక్షన్‌ చిత్రాలు రూపొందించడంలో తనకంటూ ఓ స్పెషాలిటీని ఏర్పరుచుకున్న హరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ‘సింగం’, ‘యముడు’ సినిమాల దర్శకుడు హరి దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1,100ల థియేటర్లలో విడుదలవుతుంది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సైతం భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుందని చిత్ర వర్గాలు చెబుతుంది. అన్ని చోట్ల నుండి పూజ మూవీపై పాజిటివ్ టాక్ రావడంతో, మూవీ గ్యారెంటీగా సక్సెస్ ని సాధిస్తుందని హీరో విశాల్ బలంగా నమ్ముతున్నాడు. విశాల్ కెరీర్ లో బిగ్గెస్ట్ రిలీజ్ ఈ సినిమాదే కావడం విశేషం. తెలుగు, తమిళ భాషలలో ఈ సినిమా ఒకే రోజు విడుదలవుతుంది. విశాల్ స్వీయ నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించింది. విశాల్ నిర్మించిన గత సినిమాలు విజయవంతం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే యువన్ శంకర్ రాజా అందించిన ఆడియో శ్రోతలకు చేరువైంది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత విశాల్‌ మాట్లాడుతూ - ''ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో చాలా మంచి స్పందన వస్తోంది. యువన్‌ శంకర్‌రాజా చేసిన సంగీతం చాలా పాపులర్‌ అయింది. త్వరలోనే ఈ చిత్రం ప్లాటినం డిస్క్‌ ఫంక్షన్‌ను చేయబోతున్నాం. ఈ చిత్రానికి బిజినెస్‌పరంగా మంచి క్రేజ్‌ వచ్చింది. హరి కాంబినేషన్‌లో 'పూజ' నాకు మరో సూపర్‌హిట్‌ చిత్రం అవుతుంది'' అన్నారు. అయితే విశాల్ నటించిన గత చిత్రాల రిజల్ట్ చూసుకుంటూ ఈ మూవీకి ఒకవేళ బాక్సాపీస్ వద్ద నెగిటివ్ రిజల్ట్ ని అందుకుంటే విశాల్ భారీగానే నష్టపోవాల్సిందే అంటూ ట్రేడ్ వర్గాలు అప్పుడే నష్టపు లెక్కలను అంచనా వేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: