భారీ చిత్రాల నిర్మాత దిల్ రాజు అంటే, టాప్ హీరోల నుండి ప్రతి ఒక్కరికీ క్రేజే. ఎందుకంటే తన బ్యానర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి, అలాగే భారీ బడ్జెట్ మూవీలు ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా దిల్ రాజు ఇబ్బందుల్లో పడిపోయాడు అంటూ టాలీవుడ్ లోని ట్రేడ్ వర్గాలు, లెక్కలు చూపిస్తున్నాయి. మేటర్ లోకి వెళితే, వరుసగా ఫెయిల్యూర్స్ వస్తే ఎవరైనా సరే తట్టుకోలేరు. పైగా, సినిమా వ్యాపారంలో ఎప్పుడు ఫెయిల్యూర్స్ వస్తాయో అస్సలు ఊహించలేం. ఒక్క సీను చూసి ఏ సినిమా ఆడుతుందో, ఏది ఆడదో చెప్పేయగలడన్న పేరున్న ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటరూ అయిన దిల్ రాజు ఇటీవలి కాలంలో అపజయాలను బాగా పొందాడు. 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం ఆయనను బాగా దెబ్బకొట్టింది. తర్వాత ఇటీవల ఆయన డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకున్న 'రభస', 'ఆగడు', 'గోవిందుడు' సినిమాలు కూడా ఆయనకు కోట్లాది రూపాయల ఆర్ధిక నష్టాన్ని చేకూర్చాయని టాలీవుడ్ లో వినపడుతోంది. దీంతో ప్రస్తుతం ఆయన నిర్మిస్తున్న 'కేరింత' చిత్ర నిర్మాణం కూడా ఆగిపోయిందని ప్రచారం జరుగుతోంది. దీనిపై దిల్ రాజు క్లారిటి ఇచ్చినా, ఈ టాక్స్ మాత్రం మీడియాలో ఆగటం లేదు. దిల్ రాజు తన మూవీలను నిర్మించే స్పీడు చాలా వరకూ తగ్గించుకున్నాడని, కథలని, హీరోలని ఒకటికి పదిసార్లు ఆలోచించి సెలక్డ్ చేసుకుంటున్నట్టు, టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే, స్క్రిప్టులో మార్పులు చేసే ఉద్దేశంతోనే ఈ షూటింగ్ ఆగిందని నిర్మాత వర్గాలు చెబతున్నా, కథ చాలా వీక్ ఉండటం, అలాగే ఫైనాన్షియల్ ఇబ్బందుల కారణంగా మూవీని కొంత కాలం పోస్ట్ పోన్ చేశారాని టాక్స్. మొత్తంగా ఎప్పుడూ మూవీలను నిర్మించే ఈ నిర్మాతలకి ఇటువంటి లాభనష్టాలు అనేవి చాలా కామన్ అని అంటున్నారు. ఏదేమైనా దిల్ రాజు ఇకనుండై కథల, తన నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు వహించపోతే, భారీ మూల్యాన్ని చెల్లించుకోకతప్పదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: