150 సినిమాలకు దర్శకత్వం వహించి ప్రపంచ రికార్డును క్రియేట్ చేసిన దాసరి, మారుతున్న కాలంలో తాను కూడా మారాలనే ఉద్దేశ్యంతో ఈమధ్య తన ఫేస్ బుక్ ద్వారా తన అబిమనులతో తన అభిప్రాయాలను షేర్ చేసుకోవడం మొదలు పెట్టాడు. సినిమా విషయాలుగానీ, వ్యక్తిగత విషయాలుగానీ, రాజకీయపరంగాగానీ ప్రతిఒక్క విషయాన్ని దాసరి తన ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసుకుంటున్నాడు.  అయితే అందులోనే అసలు సమస్య వచ్చి పడింది. గతంలో దాసరి, చిరంజీవి పై చేసిన కొన్ని ఘాటు కామెంట్స్ నేపథ్యంలో దాసరి పై కోపంగా ఉన్న మెగా అభిమానులు తమ ఘాటైన కామెంట్లతో దాసరిని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఏ విషయానికి భయపడని దాసరి తన పై చిరంజీవి అభిమానులు వెబ్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలకు తనదైన రీతిలో చాల ఘాటుగా స్పందించాడు.  ఏ హీరో అభిమానులకైనా తన మాటలను విమర్శించే హక్కు ఉన్నా తన ప్రతి మాటను నెగిటివ్ యాంగిల్ లో తీసుకుని తనను టార్గెట్ చేయడం మంచిదికాదు అంటూ క్లాసు పీకాడు దాసరి. అంతేకాదు పరిశ్రమలో ఎవరికీ ఏది నష్టం వచ్చినా వారి తరఫున మాట్లాడటం తనకు అలవాటు అంటూ తన పై మాటల దాడి చేస్తున్న అభిమానులందరూ ఏ హీరో కోసం అయితే కామెంట్ చేస్తున్నారో ఆ  హీరోను అక్కినేని, నందమూరిల తరువాత ఎదిగిన టాప్ హీరో అని మొట్టమొదటిగా పొగిడిన వ్యక్తిని తాను అని అంటూ పొరపాట్ల పై తాను విమర్సిస్తాను కాని తనకు వ్యక్తిగతంగా ఏ హీరోతోను శత్రుత్వం లేదని అంటూ మెగా అభిమానుల దాడికి అడ్డు కట్ట వేయడానికి ప్రయత్నించాడు దాసరి. రాజకీయాలకు దూరమై మళ్ళీ సినిమాలు తీస్తున్న దాసరి ఈ వ్యాఖ్యల ద్వారా చిరంజీవితో సయోధ్యకు సంకేతాలు పంపుతున్నాడు అనుకోవాలి...  

మరింత సమాచారం తెలుసుకోండి: