విడుదలకు రెడీ అయిన రేణు దేశాయ్ ‘ఇష్క్ వాలా లవ్’ సినిమాలో పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అకిరాకు డైలాగ్స్ పలకడంలో ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సులగ్నా పాణిగ్రహి ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  ఇప్పటికే ఈ సినిమా గురించి టాలీవుడ్ మీడియాలో రేణుదేశాయ్ ఎంతో ప్రచారం చేసిన నేపధ్యంలో ఈసినిమాలో తమ అభిమాన హీరో కొడుకు ఎలా ఉంటాడు అనే ఆత్రుత పవన్ అభిమానులలో చాల ఎక్కువగా ఉంది. ఈ ఆత్రుత నేపధ్యంలో అకిరా నందన్ ఈ సినిమా హీరోయిన్ పక్కన కూర్చుని ఆమె చెపుతున్న ఎదో ఒక విషయాన్ని శ్రద్దగా వింటున్న అకిరాను చూస్తే తన తండ్రిలాగే అకిరాకు కూడా ఏదైనా విషయాన్ని అనుకుంటే ఎంత పట్టుదలో అర్ధం అవుతుంది.  భారతీయ వివాహ వ్యవస్థలో వస్తున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతరం అమ్మాయిలు వివాహం తమ కెరీర్‌కు ప్రతిబంధకంగా మారుతుందనే భావనను ఆధారంగా తీసుకుని రేణు దేశాయ్ తీస్తున్న ఈ సినిమాలో అకిరా కనిపించేది కేవలం పది నిముషాలు మాత్రమే అయినా ఆ పాత్రకు ప్రాముఖ్యత ఉంది అని చెపుతోంది రేణు దేశాయ్...   

మరింత సమాచారం తెలుసుకోండి: