ఈమధ్యనే హైదరాబాద్ లో ఉన్న తన ఇంటిని కోటిన్నరకు అమ్మేసిన ఇలియానా తల్లి కూలీగా పనిచేసింది అనే మాటలు ఎవరికైనా ఆశ్చర్యo కలిగిస్తాయి. అయితే ఈ మాటలు స్వయంగా ఇలియానాయే చెప్పడంతో కొంత ఆశక్తి దాయకంగా మారింది.  ఇక వివరాలలోకి వెళితే ఈ మధ్య ఒక బాలీవుడ్ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఇలియానా తన చిన్ననాటి విషయాలను గుర్తుకు చేసుకుంది. అప్పట్లో సొంత ఇల్లు కూడా లేని ఇలియానా తల్లితండ్రులు ఏదోవిధంగా ఇల్లు కట్టుకోవాలని విపరీతమైన ప్రయత్నాలు చేసేవారట.  అప్పట్లో గోవాలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిని తండ్రి కొనడంతో ముంబాయిలో అద్దె ఇంటిలో ఉండటం ఎందుకని తమ అద్దె ఇల్లును ఖాళీ చేసి, ఇల్లు మొత్తం రెడీ కాకుండానే ఆ కొత్త ఇంటిలోకి మారారట ఇలీ బేబి కుటుంబ సభ్యులు. ఒకవైపు ఇంటి పనులు జరుగుతుంటే తాము ఎలాగోలా సర్దుకున్నా తమ తల్లి మాత్రం ఆ ఇంటి పనుల నిమిత్తం దాదాపు కూలీలా పని చేసిందని అలనాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకుంది ఇలియానా.  తాము స్కూల్ నుంచి రాగానే, తమ తల్లితో కలిసి ఇంటి పనులు చేసేవాళ్లం అని చెపుతూ ఆ అలసటతో ఒక్కోసారి నేల మీదే పడుకుని, నిద్రపోయేవాళ్లం.అని చెప్పుకొచ్చింది ఇలియానా. సినిమా తారలందరూ విలాస వంతంగా ఉంటారు అని ఊహించుకుని వార్తలు రాసే మీడియాకు చురకలు అంటిస్తూ వర్తమానాన్ని చూసి ఏ సినిమా తార జీవితాన్ని అంచనా వేయవద్దు అని అంటూ క్లాసులు పీకుతోంది ఇలియానా..  

మరింత సమాచారం తెలుసుకోండి: