పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న కారు కి యాక్సిడెంట్ జరిగింది. ఖమ్మం లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న శ్రీజ ని పలకరించడానికి ,పరామర్శించడానికి రాజమండ్రి నుండి కారులో బయలు దేరిన పవన్ కళ్యాణ్ కారుకి కొణిజర్ల వద్ద భారీ ప్రమాదం తప్పింది. పవన్ ప్రయాణిస్తున్న కారు కి యాక్సిడెంట్ కావడంతో కారు ముందు భాగం దెబ్బతిన్నడంతో మరో కారులో ఖమ్మం చేరుకున్నారు పవన్. ఐతే ఆ ప్రమాదంలో పవన్ కి ఎటువంటి గాయాలు కాలేదు. కారులో ఖమ్మం చేరుకున్న పవన్ నేరుగా ఆసుపత్రికి వెళ్లి బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న శ్రీజ ని పరామర్శించారు. రాజమండ్రి నుండి పాప కోసం తెచ్చిన బొమ్మల తో పాటు ,రెండు లక్షల రూపాయల చెక్ ని శ్రీజ కి అందించాడు పవన్ కళ్యాణ్. (source)

మరింత సమాచారం తెలుసుకోండి: