అల్లుఅర్జున్ ‘రుద్రమదేవి’ లో నటిస్తున్న గోన గన్నారెడ్డి ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది. గుణశేఖర్ అనుష్కను రుద్రమదేవిగా చూపెడుతూ అత్యంత భారీగా తీసిన ఈ సినిమాలోని ముఖ్య పాత్ర అయిన గోన గన్నారెడ్డి పాత్రను మహేష్, జూనియర్, రవితేజ ఇలా తనకు సన్నిహితులైన ప్రముఖ హీరోలందరితోను ఈ పాత్రను నటింప చేయడానికి ప్రయత్నించి చిట్టచివరకు అల్లుఅర్జున్ తో తాను అనుకున్నది సాధించాడు.  తెలుగులో నిర్మింప బడుతున్న తొలి తెలుగు హిస్టారికల్ 3D చిత్రంగా 'రుద్రమదేవి' ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకుంది. రఫ్ లుక్ తో చాల భీకరంగా కనిపిస్తున్న గోన గన్నారెడ్డి లుక్ బన్నీకి మంచి పేరు తెచ్చి పెట్టేలాగే కనిపిస్తోంది.  చూపులో క్రూరత్వం కనిపిస్తూ నల్లటి డ్రస్ లో ఒక వెరైటీ లుక్ లో అల్లుఅర్జున్ కనిపిస్తున్నా ఈ ఫస్ట్ లుక్ చూసిన విమర్శకులు మాత్రం పాత జానపద సినిమాలలోని రాజుగారి మారువేష లుక్ ను కాపీ చేసినట్లుగా గోన గన్నారెడ్డి లుక్ ను గుణశేఖర్ తీర్చి దిద్దాడు అంటూ అప్పుడే విమర్శలు వచ్చేస్తున్నాయి. గుణశేఖర్ తన ఆస్తులను కూడా తాకట్టు పెట్టి ఎన్నో ఆశలతో కాకతీయ పౌరుషాన్ని అనుష్క ద్వారా చూపెట్టడానికి చేస్తున్న ప్రయత్నం విజయవంతం కాకపోతే కెరియర్ పరంగానే కాదు ఆర్దికoగా కూడా గుణశేఖర్ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: