పవన్ రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను హీరోనే అంటూ గతంలో పవన్ భజన చేసిన సమంత మళ్ళీ నిన్నటి రోజున పవన్ పొగడ్తలను అందుకుంది. హుదూద్ బాధితుల మానసిక ధైర్యం కోసం పవన్ జరిపిన సుడిగాలి పర్యటన అద్భుతం అంటూ కామెంట్లు తన ట్విటర్ లో పోస్టు చేసింది. అంతేకాదు ఇప్పటి వరకు ఏ హీరో ప్రకటించనంత భారీ విరాళం 50 లక్షలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇచ్చి రెండు రోజులు కూడా కాకుండానే మృత్యువుతో పోరాడుతున్న శ్రీజను వ్యక్తిగతంగా చూడటమే కాకుండా ఆ అమ్మాయి వైద్యo నిమిత్తం రెండు లక్షలు ఆర్ధిక సహాయం చేసేన మంచిమనసు పవన్ కు తప్ప మరెవ్వరికీ లేదని ఆకాశానికి ఎత్తేసింది సమంత.  ఈమధ్యనే ఒక ఛానల్ కార్యక్రమంలో పవన్ కు 10/10 మార్కుల రేటింగ్ ఇచ్చిన సమంత నిన్న మరో అడుగు ముందుకు వేసి పవన్ పై కురిపిస్తున్న ప్రశంసల వర్షం పవన్ అభిమానులకు మంచి జోష్ ను ఇస్తోంది.  గతంలో సమంత ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సామాజిక కార్యక్రమాలను పవన్ బహిరంగంగా పొగుడ్తూ చేసిన వ్యాఖ్యలకు, సమంత ఈవిధంగా ఋణం తీర్చుకుంది అని అప్పుడే ఆమె చేస్తున్న పవన్ భజన పై సెటైర్లు పడుతున్నాయి. పొగడ్తలకు దూరంగా ఉండే పవన్ సమంత పొగడ్తలకు షేక్ అయినా ఆశ్చర్యం పడనక్కర లేదు.     

మరింత సమాచారం తెలుసుకోండి: