వెరైటీ కధలకు చిరునామాగా ఉండే రాజమౌళి తండ్రి విజయేoద్ర ప్రసాద్ ఫ్యాంటసీ కధలు రాయడంలో నిష్ణాతుడు. దర్శకుడిగా కొన్ని మంచి సినిమాలు తీసినా అదృష్టం కలిసి రాలేదు కాని ఆయన అదృష్టం తన కొడుకు రాజమౌళి రూపంలో ఉంది. దర్శకుడు సుకుమార్ నిర్మించబోతున్న సోషియో ఫ్యాంటసీ సినిమాకు ఒక అద్భుతమైన కధను విజయేoద్ర ప్రసాద్ సమకూర్చడమే కాకుండా ఈ సినిమాకు ఆయన దర్శకత్వం వహించడం విశేషం.  యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండే ఈ సినిమాలో నటించడానికి అందంగా కనిపిస్తూ యాక్షన్ సిన్స్ చేయగల హీరోయిన్ గురించి అన్వేషిస్తూ ఉంటే వారి ఆలోచనలకు బాలీవుడ్ బ్యూటీ శిల్పి శర్మ రూపంలో సమాధానం దొరికినట్లుగా వార్తలు వస్తున్నాయి. శిల్పికి కూడా ఈ కధ బాగా నచ్చడంతో ఆమెను ఈ ప్రాజెక్ట్ కు ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. మార్షల్ ఆర్ట్స్ కధా వస్తువుతో రూపొందే ఈ సినిమాలో నటించేందుకు శిల్పీ శర్మకు వియత్నాంలో శిక్షణ ఇప్పించేందుకు ఆమెను త్వరలో వియత్నాం కూడా పంపుతారట.  ఢిల్లీకి చెందిన మోడల్ శిల్పీ శర్మ టాలీవుడ్ లో గతంలో ‘గ్రీన్ సిగ్నల్’ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా ఆమెకు కలిసి రాకపోవడంతో టాలీవుడ్ కు దూరం అయింది. అయితే అనుకోని అదృష్టం రాజమౌళి తండ్రి రూపంలో శిల్పి శర్మకు దక్కడంతో ఆమె మంచి జోష్ మీద ఉంది అనే వార్తలు వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: