యంగ్ హీరో నితిన్ త్వరలో పెళ్ళి కొడుకు కాబోతున్నాడు అంటూ ఈరోజు ఒక ఆంగ్ల దిన పత్రిక ఒక కధనాన్ని ప్రచురించింది. ఆ పత్రికలో ప్రచురించిన వార్తలను బట్టి ఇప్పటికే మూడు పదుల వయస్సుకు దగ్గర పడ్డ నితిన్ కు త్వరలోనే పెళ్లి చేయాలని నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తన ప్రయత్నాలకు వేగం పెంచాడు అని కధనం.  తెలుస్తున్న సమాచారం ప్రకారం నితిన్ తండ్రి తన సన్నిహితులతో అలాగే తన చుట్టాలతో నితిన్ కు సరైన అమ్మాయిని వెతకమని తరుచూ చేపుతున్నాడని ఆ పత్రిక కధనం. అదేవిధంగా అమ్మాయి ధనవంతుల కుటుంబంలోంచి రాకపోయినా మంచి సాంప్రదాయ కుటుంబంలోని అమ్మాయి అయితే చాలని నితిన్ తండ్రి అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం.  అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరం సమ్మరకు నితిన్ పెళ్లి చేయాలని నితిన్ కుటుంబ సభ్యులు గట్టి పట్టుదలగా ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వరస పరాజయాల తరువాత తిరిగి హిట్ ట్రాక్ ఎక్కిన నీతిన్ కరుణాకరన్ దర్శకత్వంలో త్వరలోనే విడుదల కాబోతున్న తన లేటెస్ట్ సినిమా ‘చిన దానా నీకోసం’ విడుదల కోసం చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు. మరి పెళ్లి విషయంలో నితిన్ కు నచ్చే డ్రీమ్ గర్ల్ ఎక్కడ ఉందో మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: