టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ ప్రొఫెషనల్ గా సినిమాలలో హీరోగా కాకుంటే స్వామిజిగా రాణిస్తాడు అంటూ సమంత చేసినట్లుగా వస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే సమంత ఈ వ్యాఖ్యలు సరదాగా అందా లేక పవన్ మనస్తత్వాన్ని అంచనా వేసి అందా అంటూ చాలామంది అప్పుడే కామెంట్స్ కుడా మొదలు పెట్టేసారు. ఈ వ్యాఖ్యలు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే ఇంటర్వ్యూలో సమంత తన భవిష్యత్ ప్లాన్ గురించి కూడా చెప్పేసింది. తన వయస్సును దాచుకోకుండా మాట్లాడుతూ మరో రెండు, మూడేళ్ళలో తనకు మూడు పడుదుల వయస్సు వస్తుంది కాబట్టి ఆ వయస్సుకు ఖచ్చితంగా తాను పిల్లలను కనాలని అనుకుంటున్నానని అంటూ ఆలస్యంగా పెళ్లి చేసుకుని పిల్లలను కనే వారు ఉన్నా పెద్ద వయస్సులో పిల్లలను కంటే వారితో ఏమి ఎంజాయ్ చేస్తారు అంటూ చేసిన కామెంట్లతో త్వరలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నాను అన్న సంకేతాలు ఇచ్చింది సమంత.  పవన్ ను గురువుగారు అంటూ సంబోధించే సమంత పవన్ లోని అంతర్లీనంగా ఉండే స్వామీజీ రూపాన్ని తాను నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమాలోని పవన్ స్వామీజీ పాత్రను చూసి అనుకుందా లేకుంటే ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉండే పవన్ వ్యక్తిత్వాన్ని గమనించి సమంత పవన్ ను స్వామీజీగా మార్చిందా అనే విషయం పై క్లారిటీ లేకపోయినా పవన్ ను స్వామీజీగా పోల్చి సమంత పెద్ద సాహసమే చేసింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: