రెండు రోజుల క్రితం ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షోలో ప్రసారమైన ఒక ఎపిసోడ్ ప్రభాస్ అభిమానులకు విపరీతమైన కోపాన్ని తెప్పించి జబర్దస్త్ కార్యక్రమం పైనా ఆ ఎపిసోడ్ లో నటించిన కమెడియన్ హరీష్ పైనా ఒకేసారి ప్రభాస్ అభిమానులు మాటల దాడి చేస్తూ మెసేజ్ లు ఫోన్ కాల్స్ చేసి హరీష్ ను టార్గెట్ చేసారు అనే వార్తలు వస్తున్నాయి.  ఈ ఎపిసోడ్ లో కమెడియన్ హరీష్ ప్రభాస్ లా అతడి బాడీ లాంగ్వేజ్ మరియు గొంతును అనుసరిస్తూ ఒక ముసలి మామ్మతో కామెడీ చేసాడు. ఎప్పటిలాగే ఎడల్ట్ కామెడీగా ఈ షో నడిచి కొన్ని బూతు జోక్ లకు చిరునామాగా ఈ ఎపిసోడ్ షరా మాములుగానే నడిచింది. అయితే ఈ కార్యక్రమం చూసిన ప్రభాస్ అభిమానులు కోపంతో ఒకేసారి ఈ కార్యక్రమం పై మాటల దాడి మొదలు పెట్టడంతో ఈ కార్యక్రమంలో ప్రభాస్ లా నటించిన కమెడియన్ హరీష్ తాను ప్రభాస్ ను కించపరిచే ఉద్దేశ్యంతో ఈ ఎపిసోడ్ లో నటించలేదని తన నటన వల్ల ప్రభాస్ అభిమానులకు బాధ కలిగి ఉంటే క్షమించమని కోరుతూ తన ఫోన్ కు వస్తున్న మెసేజ్ లకు రిప్లై ఇస్తున్నట్లు సమాచారం.  జబర్దస్త్ కార్యక్రమంలో వినడానికే భయంకరంగా ఉంటున్న బూతు డైలాగ్స్ కు స్పందించని యువత సెటైర్ గా ప్రభాస్ పై చేసిన ఎపిసోడ్ కు స్పందించిన తీరు చూస్తూ ఉంటే టాప్ హీరోల క్రేజ్ నేటి యువతరాన్ని ఒక మ్యానియాలా ఎలా ప్రభావితం చేస్తోందో ఈ సంఘటనను పరిశీలించిన వారికి ఎవరికైనా తెలుస్తుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: