వినాయక్ దర్శకత్వంలో అఖిల్ నటించే సినిమాకు కౌంట్ డౌన్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ నెలాఖరు లోపు ఎదో ఒక మంచి రోజున నాగార్జున అఖిల్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనకు సంబంధించి మీడియా సమావేశం ఎప్పుడు పెట్టాలి అనే ఆలోచనలు చేస్తున్నట్లు ఫిలిం నగర్ లో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే ఈ సినిమాను అన్నపూర్ణా స్టూడియోస్ స్వయంగా నిర్మిస్తుంది అని అనుకున్నారు అంత. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను నాగార్జున నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డికి అప్పచెప్పి తాను కేవలం ఈ సినిమాకు ప్రజంటర్ గా ఉండిపోవాలని ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వినపడుతున్నాయి.  దీనికి కారణం నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తూ తాను స్వయంగా నిర్మిస్తున్న ‘సోగ్గాడే చిన్నినాయన’ అని అంటున్నారు. ఒక వైపు తాను నటిస్తున్న ఈ కొత్త సినిమా వ్యవహారాలతో పాటు అఖిల్ సినిమాను కూడా తానే తలకు ఎత్తుకుంటే నిర్మాణంలో ఏకాగ్రత లోపం వల్ల ఏదైనా పొరపాట్లు జరిగితే అది అఖిల్ కెరియర్ పై తీవ్ర ప్రభావం చూపెడుతుంది కాబట్టి అఖిల్ మొదటి సినిమా నిర్మాతగా నితిన్ తండ్రికి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అనే విషయం పై నాగ్ తన సన్నిహితులతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.  అదీకాకుండా నితిన్ కు అఖిల్ కు ఉన్న స్నేహం రీత్యా కూడా వీరిద్దరి కాంబినేషన్ తప్పకుండా హిట్ ను ఇస్తుంది అని నాగ్ నమ్మకం అని టాక్..   

మరింత సమాచారం తెలుసుకోండి: