రామ్ చరణ్ తాను ఏమి అనుకుంటే అది స్పష్టంగా ఎటువంటి మొహమాటాలు లేకుండా మాట్లాడుతాడని టాలీవుడ్ లో పేరు ఉంది. ఆ మధ్య చరణ్ ఒక ప్రముఖ దర్శకుడు తానూ ఎంతగానో అభిమానించే కుక్కతో సరిగ్గా వ్యవహరించలేదు అన్న కోపంతో ఆ దర్శకుడితో ఏకంగా సినిమానే వదిలేసుకున్నాడు అనే టాక్ ఉంది. అందుకే చరణ్ తో వ్యవహరించే దర్శకులకు కత్తిమీద సాము అని అంటారు. దసరాకు జరిగిన మహేష్ చరణ్ ల మధ్య యుద్ధంలో మధ్యగా వచ్చిన ‘లౌక్యం’ సినిమాను చూసి మొదటిగా అందరూ ఆశ్చర్య పోయారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ దసరాకు విడుదల అయిన సినిమాలలో బయ్యర్లకు పూర్తి లాభాన్ని తెచ్చి పెట్టిన సినిమాగా ‘లౌక్యం’ రికార్డు క్రియేట్ చేసింది.  ఈ విషయంలో ఎన్నో ఆశలతో చరణ్ ‘గోవిందుడు’ ను కొన్న బయ్యర్ల కన్నా ‘లౌక్యం’ సినిమా బయ్యర్లకు లాభాలు రావడం అందరికీ తెలిసిన విషయమే. ‘ఆగడు’ పరాజయం తరువాత శ్రీనువైట్లతో చేయవలసిన సినిమాకు దూరం జరిగిన చరణ్ చేయబోయే సినిమాల దర్శకుల లిస్టులో ‘లౌక్యం’ సినిమా దర్శకుడు శ్రీవాస్ కూడా చేరాడు అనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే లండన్ నుంచి తిరిగి వచ్చిన రామ్ చరణ్ కు శ్రీవాస్ వినిపించిన ఒక లైన్ నచ్చడంతో ఆ స్టోరీ లైన్ ను డెవలప్ చేయమని చరణ్ శ్రీవాస్ కు సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎందరో టాప్ డైరెక్టర్ల ఆఫర్లు కాదనుకుని శ్రీవాస్ ను నమ్ముకుంటున్న రామ్ చరణ్ లౌక్యం ఏమిటో రానున్న రోజులలో తెలిసిపోతుంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: