పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల మూవీ, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ లో పవన్ కళ్యాణ్ సీన్స్ పూర్తిగా అయిపోయాయి. దీంతో షూటింగ్ కి సంబంధించిన విషయంలో పవన్ కళ్యాణ్ కొద్దిగా రిలీఫ్ అయ్యాడు. ఇంత కాలంలో బయటకు రాని పవన్ కళ్యాణ్, ఇప్పుడు షూటింగ్ లు వంటివి ఏమి లేకపోవడంతో, తన వంతుగా సామాజిక బాధ్యతల కోసం పాటు పడుతున్నాడు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ చేతిలో ఉన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ గబ్బర్ సింగ్2. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ కోసం కూడ కసరత్తులు జరుగుతున్నాయి. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఓ యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ పేరు, ఇప్పుడు గబ్బర్ సింగ్ 2లో హీరోయిన్ అంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. టాలివుడ్ లో ఈ మధ్యన రకుల్ ప్రీత్ మంచి విజయాలు సాధిస్తుంది. వరుసగా హిట్లు సాధించిన ఈ భామ చేతిలో ప్రస్తుతం డజన్ సినిమాల వరకు వున్నాయి. రకుల్ పవన్ కళ్యాణ్ సరసన ‘గబ్బర్ సింగ్ 2′ లో నటించనుందని క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. ఇంకా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి వుండగా, ఆమె పేరు మాత్రం గట్టిగా వినపడుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ తో ఇప్పటికే గబ్బర్ సింగ్2 మూవీకి చెందిన చిత్ర యూనిట్ సంప్రదింపులు జరిపినట్టుగా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడ త్వరలోనే హీరోయిన్ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: