మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ‘కరెంట్ తీగ' సినిమాలో సంపూర్ణేష్ బాబు సన్నీ లియోన్ కు భర్త పాత్రలో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి. నటించిన ఒకే ఒక్క సినిమాతో సెలిబ్రిటీ హోదా అందుకున్న సంపూర్ణేష్ క్రేజీ హాట్ బ్యూటీ సన్నీ పక్కన ఎలా ఉంటాడు అనే టాక్ మొదలు అయ్యింది.  ఈసినిమాలో నటించినందలకు సన్నీ ఏకంగా 75 లక్షలు తీసుకుంది అని ఒక ఛానెల్ కార్యక్రంలో పాల్గొన్న ఈ సినిమా హీరో మనోజ్ స్వయంగా చెప్పడంతో ఈవార్త ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో సన్నీ టీచర్ గా చేస్తున్నది చిన్న పాత్ర అయినా సన్నీ క్రేజ్ ను అడ్డుపెట్టుకుని భారీ ఓపెనింగ్స్ రాబట్టాలని మంచు కుటుంబం ప్లాన్.  కేవలం సన్నీ ఐటెమ్ సాంగ్ లోని కరెంట్ తన కరెంట్ తీగకు మెయిన్ పవర్ అని ఆలోచిస్తూ మనోజ్ ఈ సినిమా పై చాలా భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఇప్పటికే విడుదల కావలిసిన ఈ సినిమా హుధూద్ తుఫాను కారణంగా విడుదల వాయిదా వేసిన సంగతి తెలసిందే. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఈనెల 31న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే అదే రోజు విడుదలకు రెడీ అవుతున్న విజయ్, మురగదాస్ ల ‘కత్తి’ తో పోటికి ‘కరెంటుతీగ’ వస్తుందా అనే అనుమానాలు కూడ ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: