నగరాలలో పబ్ లలో చిందులు వేసే అమ్మాయిలు మద్యం తాగడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇక సినిమాలలో హీరోయిన్స్ కూడా మందు తాగి చిందులు వేసే సన్నివేశాలు సర్వసాధారణంగానే కనిపిస్తున్నాయి. ఆ మధ్య హీరోయిన్ ప్రియా ఆనంద్ ‘అరిమానంబి’ చిత్రంలో గ్లాసులు గ్లాసుల మద్యం తాగి రచ్చకెక్కింది. ఈ విషయం పై ఆమెను ఆ మధ్య మీడియా ప్రశ్నిస్తే ఏం మగాళ్లు మద్యం సేవించడం లేదా? వాళ్లకో న్యాయం ఆడవాళ్లకు ఒక న్యాయమా అంటూ ఎదురు ప్రశ్నలు వేసి మీడియాకు షాక్ ఇచ్చింది ప్రియా ఆనంద్. మొన్న దసరాకు విడుదల అయిన ‘గోవిందుడు అందరివాడేలే’ లో కాజల్ పబ్ లో మందు తాగుతూ కనిపించి యూత్ ను బాగా ఆకర్షించింది.  దీనితో కాజల్ అగర్వాల్ తరచూ పబ్‌లకు, బార్‌లకువెళ్ళడం బట్టే అంత బాగా ఆ సినిమాలో నటించింది అని సెటైర్లు మొదలు అయ్యాయి. ఈ విషయమై ఈ మధ్య తమకు ఎదురు పడిన కాజల్ ను మీడియా వారు సరదాగా ప్రశ్నిస్తే కాజల్ విచిత్రమైన వివరణ ఇచ్చింది. దర్శకుడు కృష్ణ వంశి ‘గోవిందుడు’ సినిమాలో ఈ సన్నివేసం గురించి చెప్పినప్పుడు అలాంటి సన్నివేశంలో నటించే విషయంలో తాను సంకోచించాను అంటూ దర్శకుడు తప్పదు అని అనడంతో తాను అలా నటించానని చెప్పుకొచ్చింది కాజల్.  అయితే నిజానికి మహిళలు మద్యంతాగుతారు అనే విషయం తనకు తెలియదు అని ఆమె మీడియా వారితో కామెంట్ చేయడం తో మీడియా మైండ్ బ్లాంక్ అయిందట. అంతేకాదు తానెప్పుడూ మద్యం తాగలేదు అని అంటూ అయితే స్నేహితులతో పబ్‌లకు మాత్రం వెళతానని అక్కడ మద్యం కాకుండా కేవలం పండ్లరసం మాత్రమే తీసుకుంటానని చెపుతున్న మాటలు పబ్బులకు వెళుతున్న అమ్మాయిలు ఆదర్శంగా తీసుకుంటే మద్యం తాగే వారు లేక చాలా పబ్బులు మూత పడే రోజులు వస్తాయి అమ్నుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: