అతి చిన్న వయస్సులో సిసింద్రీగా వెండితెర పై హడావిడి చేసిన అఖిల్ కు అనుకోకుండా చిల్డ్రన్స్ డే సెంటిమెంట్ కలిసి వచ్చిన రోజుగా మారడం ఆశ్చర్య పరుస్తున్న సంఘటనగా మారింది. అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అఖిల్ హీరోగా నటించబోయే తొలి సినిమా ముహూర్తం పండిట్ జవహర్ లాల్ నెహ్రు పుట్టినరోజు అయిన నవంబర్ 14 చిల్డ్రన్స్ డే నాడు తొలి క్లాపింగ్ జరగబోతోంది అనే వార్తలు వస్తున్నాయి.  అఖిల్ హీరోగా మారినా టాలీవుడ్ హీరోలలో అతి చిన్న వయస్సు ఉన్న హీరో అవడంతో చిల్డ్రన్స్ డే సెంటిమెంట్ ను ఎంచుకున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి. ఫిలింనగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం అఖిల్ వినాయక్ ల సినిమా ప్రారంభోత్సవం నవంబర్ 14న అత్యంత ఘనంగా జరపడానికి నాగార్జున ప్లాన్ చేస్తున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. వెలిగొండ శ్రీనివాస్ అందించిన కధకు కోన వెంకట్, గోపీ మోహన్ లు స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారని టాక్. ఈ సినిమా స్క్రిప్ట్ కు సంబంధించి ప్రతి సీన్ లో వచ్చే డైలాగ్స్ విషయంలో నాగార్జున చాల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.  ఈసినిమాకు దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తూ ఉండటంతో పాటల ట్యూన్స్ విషయంలో కూడా నాగ్ ప్రత్యేక దృష్టి పెట్టాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. హీరో నితిన్ సిస్టర్ నిఖితా రెడ్డి అన్నపూర్ణా సంస్థతో కలిసి నిర్మించ బోతున్న ఈ సినిమా విడుదల కాకుండానే నాగార్జునకు, అఖిల్ పై ఉన్న క్రేజ్ రీత్యా బిజినెస్ పరంగా కోట్లు కురిపించే అవకాసం ఉంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: