ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అతలాకుతలం చేసి అందాల విశాఖపట్టణాన్ని మోడు బారిన చెట్టుగా మార్చిన హుదూద్ పై కూడా సెటైర్లు వేయకుండా వదలటం లేదు విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కొన్ని వేల కోట్ల నష్టాన్ని కలుగ చేసిన హుదూద్ తుపాన్ బాధితుల్ని ఉద్దేశించి వర్మ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారాయి. వైజాగ్‌ ఉత్తరాంధ్ర ప్రాంతంలోని తుపాన్ బాధితులు తాము త్వరగా కోలుకోవాలని పూజలు, పునస్కారాలు చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని, వర్మ అసలు వాళ్లకు ఈ పరిస్థితి కల్పించిందే దేవుడు కదా? దేవుడు తెచ్చిన కష్టాలను తొలగించమని కోరుకుంటూ తిరిగి అదే దేముడికి ప్రార్ధనలు చేయడం ఏమిటి అని అంటూ తన ట్విట్స్ ద్వారా ప్రశ్నిస్తున్నాడు వర్మ. ఇప్పటికే రకరకాల సందర్భాలలో దేవుళ్ళ పై విచిత్ర వ్యాఖ్యలు చేసి తన పై కేసులు వేయించుకుంటున్న వర్మ తాను మాఫియాకు, దెయ్యాలకే కాదు దేవుళ్ళను కూడా భయపెట్టగలను అని తన ట్విట్స్ తో మరోసారి నిరూపించుకుంటున్నాడు ఈ విలక్షణ దర్శకుడు. వర్మ ఎన్ని కామెంట్స్ చేసినా రాతిలో కూడా దేవుడున్నాడు అని భావించే మన వారి మూఢనమ్మకాలను చెదరగొట్టే శక్తి వర్మకు లేదు అనేది వాస్తవం. అయితే వర్మ తన ప్రయత్నం మానకుండా రాబోతున్న రోజులలో మరో దేవుడుని టార్గెట్ చేస్తూనే ఉంటాడు అని అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: