కృష్ణంరాజు నటవారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అతితక్కువ కాలంలోనే తెలుగు సినిమా టాప్ యంగ్ హీరోలలో ఒకడుగా ఎదగడమే కాకుండా ఎంతోమంది అమ్మాయిలకు డార్లింగ్ అయ్యాడు. తాను నమ్మిన ‘బాహుబలి’ కోసం దాదాపు 20 నెలలు పైగా మరొక సినిమా చేయకుండా ఆఖరికి పెళ్ళి కూడా వదులుకుని ఒక కఠోర తపస్సుగా చేస్తున్న ‘బాహుబలి’ ప్రభాస్ కల.  అత్యాధునిక సినీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ సినిమా నిర్మాణంగాని భారీ బడ్జెట్ తో తీస్తున్న రాజమౌళి ప్రయోగం ‘బాహుబలి’ పై కొండంత నమ్మకం ఉంచుకున్నాడు ప్రభాస్. ఈ వెండితెర డార్లింగ్ తో సినిమాలు చేయడానికి బోలెడంత మంది దర్శక, నిర్మాతలు వెయిటింగ్ లో ఉన్నా ప్రభాస్ కు ‘బాహుబలి’ తప్ప మరో లోకం లేదు.  ‘మిర్చి’ విడుదలై ఇప్పటికి 20 నెలలు గడిచి పోతున్నా ఎంతో మంది యంగ్ హీరోలు టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నా ప్రభాస్ క్రేజ్ తగ్గడంలేదు సరికదా మరింత పెరిగిపోవడం ప్రభాస్ స్థాయిని సూచిస్తోంది. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అన్న ప్రభాస్ డైలాగ్ లా టాలీవుడ్ రికార్డులను గురిపెడుతూ తానూ 2015 ఏప్రిల్ లో వస్తున్నాను అంటూ మహా భారత యుద్దంలో అర్జనుడు తన గాండీవంతో అద్భుతాలు చేసినట్లుగా టాలీవుడ్ రికార్డులను తిరగ రాయడాని తన విల్లును ఎక్కి పెడుతున్నట్లుగా నేడు జరుగుతున్న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘బాహుబలి’ సరికొత్త స్టిల్‌ మీడియాలో సందడి చేస్తోంది.  12 ఏళ్ళ కెరియర్‌ లో కేవలం 16 సినిమాలు నటించిన ప్రభాస్ తన17వ సినిమాగా రాబోతున్న 'బాహుబలి' తో ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో రానున్న 2015లో తేలిపోతుంది. డార్లింగ్ ప్రభాస్ కి ఎపి హెరాల్డ్ జన్మదిన శుభాకాంక్షలు..   

మరింత సమాచారం తెలుసుకోండి: