రచయతగా టాలీవుడ్ సినిమారంగంలోకి ఎంట్రీ ఇచ్చి అనేక సినిమాలకు రచయత పనిచేసిన తరువాత శ్రీకాంత్ కృష్ణంరాజులు నటించిన ‘మా నాన్నకు పెళ్లి’ సినిమా ద్వారా తాగుబోతు పాత్ర చేసిన ఎమ్మెస్ ఆతరువాత వచ్చిన అనేక తెలుగు సినిమాలకు అదే తాగుబోతు పాత్రలకు చిరునామా గా మారిపోయాడు. అటువంటి ఎమ్మెస్ తన కెరియర్ లో ఇప్పటివరకు 700 సినిమాలు చేస్తే అందులో 200 సినిమాలకు పైగా తాగుబోతు పాత్రలు చేసి ఒకే పాత్ర ఇన్ని సినిమాలలో చేసిన నటుడిగా ప్రపంచ రికార్డు క్రియాట్ చేసానని ఎమ్మెస్ చెపుతున్నాడు.  ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెస్ మరిన్ని విషయాలు చెపుతూ తానూ ఎన్నో పాత్రలలో ఇప్పటివరకు నటించినా తాను ఇప్పటివరకు తాను విలన్ కేరెక్టర్ చేయలేదని, ఈ పాత్ర చేస్తే సంపూర్ణమైన నటుడుగా తనకు పేరు వస్తుమదని అంటూ తన విచిత్రమైన కోరిక వ్యక్త పరిచాడు ఈవిలక్షణ హాస్య నటుడు.  తాను ఇన్నిసార్లు తాగుబోతుగా నటించినా ప్రేక్షకులు విసుగు చెందలేదని అంటూ ఇకముందు కూడా తాను తాగుబోతు పాత్రలు చేస్తానని చెప్పుకొచ్చాడు ఎమ్మెస్. అంతేకాదు తనది ఆకాలంలో ప్రేమ వివాహమని అంటూ లెక్చరర్ గా తాను పనిచేస్తున్న రోజులలో తన దగ్గరకు ట్యూషన్ కు వచ్చిన స్టూడెంట్ నే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని తన లవ్ సీక్రెట్ విప్పి షాక్ ఇచ్చాడు విప్పాడు ఎమ్మెస్.  

మరింత సమాచారం తెలుసుకోండి: