ఇప్పటి వరకు ప్రముఖ జ్యూయలరీ సంస్థలకు, సెల్ ఫోన్స్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ ఆ సంస్థలకు క్రేజ్ ను తెచ్చి పెడుతూ తాము కూడా కోట్లు గణించుకుoటున్న మహేష్, చరణ్ జూనియర్ల వ్యవహార శైలి వల్ల డివిడి షాపులకు బిజినెస్ పెరుగుతోంది అనే సెటైర్లు ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి.  ఇక ఆశక్తికరమైన ఈ విషయం వివరాలలోకి వెళితే రామ్ చరణ్, మహేష్ జూనియర్లకు వారు నటించబోయే సినిమాలకు సంబంధించి రకరకాల కధలు చెప్పినా ఏ కధ ఆ టాప్ హీరోలకు నచ్చక పోవడంతో విసుకు చెందిన ప్రముఖ టాలీవుడ్ రచయితలు అంతా కొత్త సినిమాల కధల కోసం అన్వేషిస్తూ భాగ్యనగరంలోని డివిడి షాపులలో దొరుకుతున్న ఇంగ్లీష్, ఫ్రెంచ్, కొరియన్ భాషల సినిమా సీడీలను చూస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నారని రచయితల పై సెటైర్లు పడుతున్నాయి.  మసాలా కధలు వద్దు వెరైటీ కధలు కావాలి అంటూ డిమాండ్ చేస్తున్న మహేష్, చరణ్, జూనియర్ల కోరిక తీర్చడానికి ఈ డివిడి ల హంగామా అని అంటున్నారు. ఈ భాషలకు సంబంధించిన సినిమాలు ఇంటర్ నెట్లో దొరికినా ఆ సినిమాలు కధలను తెలుగు సినిమా కధగా మారిస్తే కాపీ అని పసికడతారు అన్న ఉద్దేశ్యంతో 1990 ప్రాంతంనాటి పాత ఇంగ్లీష్, ప్రెంచ్, కోరియన్ భాషల సినిమాల సీడీలు చూస్తూ మన టాప్ యంగ్ హీరోల కోసం మన రైటర్స్ అంతా తెగ కష్టపడిపోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి..   

మరింత సమాచారం తెలుసుకోండి: