దాసరినారాయణరావు దాదాపు మూడు సంవత్సరాల పైన గ్యాప్ తీసుకుని తన 151వ సినిమాగా తీస్తున్న ‘ఎర్ర బస్సు’ సినిమాలో పేరుకు విష్ణు హీరోగా నటిస్తున్నా అతడి పాత్ర కేవలం 30 నిమిషాలకు మించి ఉండదు అని వార్తలు వస్తున్నాయి.  అమెరికా వెళ్ళాలి అని అనుకునే సాఫ్ట్ వేర్ మనవడికి చదువుకొని పల్లెటూరి తాతయ్యకు మధ్య జరిగే ఈ సినిమా కధ కామెడీ మార్క్ గా ఉంటుందని టాక్. తమిళంలో సూపర్ హిట్ కొట్టిన మంజాపాయ్ కి రీమేక్ గా దాసరి తీస్తున్న సినిమా ఇది. దాదాపు 150 సినిమాలకు సొంతంగా కధలు రాసుకున్న దాసరి తన కెరియర్ లో మొట్టమొదటిసారిగా ఒక తమిళ సినిమాను రీమేక్ చేయడం బట్టి దాసరి లాంటి దర్శకులు కూడా సినిమా కథల విషంలో ఎంత టెన్షన్ పడుతున్నారో అర్ధం అవుతుంది. దాసరి దర్శకత్వం వహించిన ‘తాతామనవడు’ తరవాత అదే తాతామనవడు సెంటిమెంట్ తో తీస్తున్న సినిమా ఇది. ఎర్రబస్సులో ఎక్కి ప్రయాణించిన వారు కూడా ఎర్రకోట పై జెండాలు ఎగరవేసారు అనే సత్యాన్ని దాసరి ఈ ఎర్రబస్సులో చేపుతారట.  ఇంత వరకు బాగానే ఉంది, కాని దాసరి లాంటి టాప్ డైరెక్టర్ కూడా ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కేథరిన్ గురించి మాట్లాడుతూ మహానటి సావిత్రి తరువాత షూటింగ్ స్పాట్ కు అనుకున్న సమయానికంటే ముందు వచ్చే హీరోయిన్ గా పొగడటం కొంత అతి అనిపిస్తోంది. ఏమైనా ఈసినిమాలో పేరుకు హీరో విష్ణు అయినా కథ అంతా దాసరి చుట్టూ తిరగడం విష్ణుకు షాకింగ్ న్యూస్ అనుకోవాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: