కలర్ ఫుల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ కి ఎంత వరకూ సెక్యూరిటి ఉంది? అనే విషయాలను ఆలోచించడం అనేది చాలా తక్కువుగా జరుగుతుంది. ఎందుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ పై సరైన అభిప్రాయం లేకపోవడమే ఇందుకు కారణం. అయితే రీసెంట్ గా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ అప్ కమింగ్ హీరోయిన్ పై అత్యాచారం జరిగిందనే వార్త, తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ బిటౌన్ లో హాట్ టాపిక్ గా హల్ చల్ చేస్తుంది. బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చిన్న చిన్న మూవీలు చేసుకుంటూ స్టార్ హీరోల మూవీలో లీడ్ రోల్స్ ని చేస్తున్న అప్ కమింగ్ యాక్టర్ రియాఖాన్ పై, ప్రొడక్షన్ యూనిట్ లో పనిచేసే ఓ యువకుడు అత్యాచారం చేయటానికి ప్రయత్నించాడు. అయితే రియాఖాన్ పై సరైన సదాభిప్రాయం ఆ ప్రొడక్షన్ బాయ్ కి లేకపోవడం, దాన్ని మనసులో ఉంచుకొని ఆమెతో కొన్ని మాటల సంబాషణ అనంతరం, ఓ మూవీకి సంబంధించిన సెట్స్ లోనే ఈ ఘూతుకానికి తను పాల్పడినట్టు ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. రియాఖాన్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ షూటింగ్ ఆ రోజు బాగా లేటు అయింది. రాత్రి 1 గంట వరకూ షూటింగ్ జరగటంతో, పేకప్ తరువాత అందరూ త్వరగా వెళ్ళి పోయారు. కాని రియాఖాన్ తో తెలివిగా సంబాషనలు జరిపి, అందరూ వెళ్ళిపోయే వరకూ ఆ యాక్టర్ ని అక్కడే ఉండే విధంగా మేనేజ్ చేశాడట. చివరకు ఆ ప్రొడక్షన్ బాయ్ ఏ మాట్లాడుతున్నాడో? ఏం ఆశిస్తున్నాడో తెలుసుకునే లోపే, తనపై అత్యాచార ప్రయత్నానానికి పాల్పడ్డాడు. చివరకు రియా అక్కడ నుండి తప్పించుకొని, వారం రోజుల షూటింగ్ అనంతరం, జరిగిన విషయాన్ని చిత్ర నిర్మాత, అలాగే యూనిట్ సభ్యులకి తెలియజేసింది. చిత్ర నిర్మాత ఆ ప్రొడక్షన్ బాయ్ పై సీరియస్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: