విలక్షణ దర్శకుడు రామ్ గోపల్ వర్మ రానా కోసం ఒక ప్రత్యేకమైన ‘గొలుసు’ ను తయారు చేస్తున్నాడు. ఈమధ్య రోజుకు ఒక వివాదంలో చిక్కుకున్న వర్మ రానా కోసం తయారు చేసిన ఈ ‘గొలుసు’ వర్మ తీయబోయే సినిమా టైటిల్. అండర్ వరల్డ్ గ్యాంగ్ వార్స్ సినిమాలు తీయడంలో అందవేసిన చేయిగా పేరుగాంచిన వర్మ తన పాత పద్దతిలో ముంబాయ్ మాఫియా సామ్రాజ్యానికి సంబంధించి ఒక యదార్ధ సంఘటన ఆధారంగా ఈ ‘గొలుసు’ స్క్రిప్ట్ ను తయారు చేసాడు అని టాక్. ఈ కధ లైన్ విన్న వెంటనే రానా వర్మ సినిమాలో నటించడానికి ఆసక్తి కనబరిచాడు అనే వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య వర్మ పని అపోయింది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో వర్మ తన పూర్వ స్థాయి సత్తాను చూపే విధంగా ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు అని టాక్. వర్మ గతంలో గ్యాంగ్ వార్ నేపధ్యంలో తీసిన సినిమాలు ‘సత్య’, ‘గాయం’, ‘సర్కారు’ లాంటి సినిమాలు సూపర్ హిట్ కావడంతో అదే స్థాయిలో తన రేంజ్ చూపెట్టడానికి వర్మ ఈ ‘గొలుసు’ ప్రయోగాన్ని రానా తో చేయబోతున్నాడు అనుకోవాలి. వర్మ పేరు చెపితే హీరోలంతా పారిపోతున్న ప్రస్తుత పరిస్థుతులలో వర్మను నమ్మి సినిమా చేస్తున్న రానా ధైర్యం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది. ఈ సినిమా వచ్చే నెలలోనే ప్రారంభించి అతి త్వరగా పూర్తి చేసి విడుదల చేసే ఉద్దేశ్యంలో ఉన్నాడట వర్మ..  

మరింత సమాచారం తెలుసుకోండి: