వెండితెర మన్మధుడు నాగార్జున తన కొడుకు నాగచైతన్యతో కలిసి ఈరోజు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం ప్రజలు విపరీతంగా నమ్ముతున్న నమ్మకాల పై ఆశక్తికర వ్యాఖ్యలు చేసాడు. సుమారు 75 సంవత్సరాలు తెలుగు సినిమారంగాన్ని నటసామ్రాట్ గా ఏలిన అక్కినేని నాగేశ్వరరావుకు దేవుడు, జ్యోతిష్కం, వాస్తుల పై నమ్మకం లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అటువంటి మహానటుడికి కుమారుడిగా పుట్టిన నాగార్జున వాస్తు, సాంప్రదాయాల నమ్మకాల పై అనేక షాకింగ్ కామెంట్స్ చేసాడు.  తాను వాస్తును బాగా నమ్ముతానని అదేవిధంగా హిందూ మతంలోని సాంప్రదాయాలను కూడా చాల గౌర విస్తానని కామెంట్లు చేసాడు నాగ్. హిందువులు దైవంగా భావించే ఆవును గృహప్రవేశం సమయంలో గోమాతగా ఇంటి చుట్టూ తిప్పడం వెనుక ఆ ఇంటిలోని కాస్మిక్ రేస్ ను ఆవు ఎక్కువగా ఆకర్షిస్తుంది అనే నమ్మకంతో పెద్దలు ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించారని అంటూ ఒకప్పుడు ఆవు పక్కన గర్భవతులు పడుకుంటే కడుపులో ఉన్న ఆ బిడ్డకు దోషాలు నివృత్తి అవుతాయనే నమ్మకం ఉండేదని నాగ్ అభిప్రాయ పడ్డాడు.   అయితే ఇలాంటి విషయాలు తాను నమ్మి ఎదుటివారికి చెపితే నవ్వుతూ ట్రాష్ అంటారని అంటూ జీవితంలో వచ్చే అనుభవాలే వాస్తు పై సంప్రదాయాల పై నమ్మకాన్ని కలిగిస్తాయని అభిప్రాయ పడ్డాడు నాగార్జున.  మొన్న జరిగిన దీపావళి రోజున తాను తన కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించినప్పుడు ఐదు పదుల వయస్సు దాటిపోయినా తనకు తల్లితండ్రులు లేరే అని బాధ పడుతున్న సమయంలో తన పిల్లలు తన వద్దకు వచ్చి తామే తల్లితండ్రులమని అంటూ ఇచ్చిన మనో ధైర్యం తనను ఎంతో ప్రభావితం చేసింది అని అంటున్నాడు ఈ వెండి తెర మన్మధుడు...   

మరింత సమాచారం తెలుసుకోండి: