ప్రస్తుతం టాప్ యంగ్ హీరోల రేసులో ముందు వరసలో ఉంటూ టాలీవుడ్ నెంబర్ వన్ స్థానo పై కన్నేసి అడుగులు వేస్తున్న రామ్ చరణ్ కు వాస్తవంగా సినిమాలలో నటించడం పై చిన్ననాటి నుండి పెద్దగా ఇష్టంలేదట. ఈ విషయాన్ని స్వయంగా చరణ్ చెప్పడం ఆశ్చర్యo కలిగిస్తోంది.  తాను చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెరిగినా తనకు చిన్ననాటి నుండి రకరకాల మోడల్ కార్ల పై ఉన్న మోజుతో ఆ కార్ల పై రీసెర్చ్ చేస్తూ ఒక పెద్ద ఆటోమొబైల్ ఇంజనీర్ గా మారి పెద్దయ్యాక ఒక పెద్ద కార్ల ఫ్యాక్టరీ సొంతంగా పెట్టుకోవాలని ఆలోచించాను తప్ప, తనకు సినిమాల పై చిన్నతనంలో ఏనాడు మోజులేదు అన్న విషయాన్ని చెప్పాడు రామ్ చరణ్. అయితే తన ఇంటికి వచ్చే ప్రముఖ నిర్మాతలు, రాఘవేంద్రరావు లాంటి టాప్ డైరెక్టర్లు తరుచూ తన వంక చూస్తూ ‘నీ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు’ అని తరుచు అడుగుతూ ఉండటంతో తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి సినిమాలలోకి వచ్చాను కాని మొదట్లో తనకు సినిమాలలో నటించే విషయంలో పెద్దగా అభిరుచి లేదు అనే విషయాన్ని నిన్న ఒక ప్రముఖ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు చరణ్. అదే ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ తాను నటించిన మొట్టమొదటి సినిమా ‘చిరుత’ లో నటించిన నేహ శర్మను తాను పెళ్ళి చేసుకోబోతున్నానని, అంతేకాదు ఆమెతో డేటింగ్ చేస్తున్నానని గాసిప్పులు తన మొదటి సినిమా వచ్చిన రోజులలో మీడియాలో ఈ వార్తలు వచ్చినప్పుడు తాను అదిరి పోయాననీ అయితే ఈ విషయాలన్నీ సర్వసాధారణం అని తన తండ్రి చిరంజీవి అనడంతో తన మనస్సు తేలిక పడిందని అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు రామ్ చరణ్...  

మరింత సమాచారం తెలుసుకోండి: