బాలీవుడ్ సినిమాలను అనుసరిస్తూ మన టాలీవుడ్ సినిమాలలో కూడా ఈ లిప్ లాక్ సీన్స్ సర్వసాధారణంగా మారిపోయాయి. మన హీరోయిన్స్ కూడా ఇటువంటి సన్నివేశాలలో నటిస్తే యూత్ లో తమ క్రేజ్ పెరుగుతుంది అన్న ఉద్దేశ్యంతో ఇటువంటి సీన్స్ లో నటించడానికి ఉత్సాహ పడుతున్నారు. అంతేకాదు ఈ లిప్ లాక్ సీన్స్ కొంతమంది హీరోయిన్స్ కు సెంటిమెంట్ గా కూడా మారిపోతున్నాయి.  ఈమధ్య ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ తాను నాగచైతన్యతో లిప్ లాక్ చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి అని అంటూ ఈ లిప్ లాక్ తమ జంటకు సెంటిమెంట్ గా మారిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ క్రేజీ హీరోయిన్ రెజీనాకు కూడా అంటుకుంది అ నే వార్తలు వస్తున్నాయి.  ప్రస్తుతం టాలీవుడ్ పరిశ్రమలో జూనియర్ ఇలియానాగా పేరుగాంచిన ఈ క్యూట్ బ్యూటీ ఇప్పటి వరకు నటించిన తాను నటించిన మూడు సినిమాలలో హీరోలతో లిప్ లాక్ సీన్స్ లో నటించి లిప్ లాక్ హ్యాట్రిక్ అందుకుంది. తన ఫస్ట్ హీరో సందీప్‌కిషన్‌కు ‘రొటీన్ లవ్‌స్టోరీ’, ‘రారా కృష్ణయ్య’ సినిమాల్లో రెండు లిప్‌లాక్స్ చేసిన రెజీనా ‘పవర్’లో రవితేజాతో కూడ ఇటువంటి సన్నివేశాలలో నటించి హ్యాట్రిక్ పూర్తి చేసింది.  ఇప్పుడు రెజీనా సాయిధరమ్ తేజ్ తో నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాలో కూడా వీరిద్దరి మధ్య ఒక ఘాటైన లిప్ లాక్ సీన్ ఉంది అని ప్రచారం జరుగుతోంది. లిప్ లాక్ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా హిట్ కొడితే రెజీనా లిప్ లాక్ క్వీన్ గా మారిపోతుంది అంటూ అప్పుడే ఆమె పై సెటైర్లు వేస్తున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: