రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి సూపర్ హిట్ సినిమా వెనుక రాజమౌళి తండ్రి ప్రముఖ సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించిన స్క్రిప్ట్ ప్రముఖ పాత్ర వహించింది అనే విషయం అందరికి తెలిసిందే. అటువంటి విజయేంద్ర ప్రసాద్ రాసి తాను దర్శకత్వం వహిద్దాము అని అనుకుంటున్న ఒక వెరైటీ సినిమా కధకు ఇప్పుడు హీరోయిన్స్ దొరకక పోవడం టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.  చాలామంది ప్రముఖ హీరోయిన్స్ ఈ సినిమాలో నటిద్దాము అని ఉత్సాహం చూపెట్టిన వారు ఈకధ విన్న తరువాత బెదిరి పారిపోతున్నారు అని టాక్.దీనికి కారణం ఈ సినిమా కధను బట్టి ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ కొన్ని న్యూడ్ సన్నివేశాలలో నటించవలసి ఉంటుందట.  వాస్తవిక దృష్టితో అత్యంత ధైర్యంగా విజయేంద్ర ప్రసాద్ తీయబోతున్న ఈ సినిమాకు సెన్సార్ నుండి ఎటువంటి అడ్డంకులు రాకుండా ఈ సినిమాను హైదరాబాద్ లోని సెన్సార్ బదులు ముంబాయ్ లోని కేంద్ర సెన్సార్ బోర్డు చేత ఈసినిమాకు సంబంధించిన సర్టిఫికేట్ తెచ్చుకోవాలని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నాడు అంటే ఈ సినిమాలో అడల్ట్ సీన్స్ ఏ స్థాయిలో ఉంటాయో అర్ధం అవుతోంది అని అంటున్నారు.  విజయేంద్ర ప్రసాద్ చెపుతున్న ఈ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాకు టాప్ హీరోయిన్స్ ఎవ్వరూ దొరకక పోవడంతో ఈమధ్యనే విడుదల అయిన ‘గాలిపటం’ హీరోయిన్ క్రిస్టిన అఖీవా పై విజయేంద్ర ప్రసాద్ దృష్టి పడిందనే వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాలో పుట్టి పెరిగిన ఈ ఇండియన్ బ్యూటీ విజయేంద్ర ప్రసాద్ కధకు ఓకె చెప్పింది అనే టాక్ ఉంది.  అయితే ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ అధికారికంగా ధృవీకరించడం లేదు. రొటీన్ కధలకు భిన్నంగా ఒక మంచి కధను తయారు చేస్తే ఆ సినిమాలో నటించడానికి హీరోయిన్స్ పారిపోవడం ఈ విలక్షణ కధారచయిత విజయేంద్రడుకి షాకింగ్ గా మారిందని టాక్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: